పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసిన జగన్ ఇప్పుడు అదే ఊపులో మరో మున్సిపల్ పోరుకు రెడీ అవుతున్నారు. కోర్టు కేసులు, విలీనాలపై అవరోధాలు, అభ్యంతరాలతో నిలిచిపోయిన ఈ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పాలనపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కొత్త ఎస్ఈసీతో పూర్తి చేయాలని భావిస్తోంది.
వచ్చే నెలలో ఆయా చోట్ల సామాజిక సర్వేతోపాటు డివిజన్ల పునర్విభజన, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లబోతోంది. ఏపీలో తాజాగా 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 12 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపుపై హైకోర్టు నిషేధం విధించడంతో అక్కడ ఫలితం పెండింగ్ లో ఉంది. ఇవి కాక వాయిదా పడిన మరో 32 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వరుసగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల విజయాలతో ఊపు మీదున్న వైసీపీ సర్కార్.. అదే ఊపును వీటిలోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది.మొత్తం ఎన్నికలు పూర్తి చేసి ఇక పాలనపై దృష్టి పెట్టేందుకు ఆలోచిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో 3 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్లలో ఎన్నికలు నిలిచిపోయాయి. అలాగే చిత్తూరు జిల్లా బి.కొత్తకోట, కడప జిల్లా రాజంపేట, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నెల్లూరు జిల్లా కావలి, ఆలూరు, గూడూరు, శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ, కృష్ణాజిల్లా వైఎస్సార్ తాడిగడప, ప్రకాశం జిల్లా కందుకూరు, పొదిలి, గుంటూరు జిల్లా బాపట్లతో పాటు మరికొన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి .
తాజాగా పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియపై హైకోర్టులో దాఖలైన కేసులు కూడా క్రమంగా తొలగిపోతున్నాయి. దీంతో ఆయా చోట్ల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.