గంటాకు జగన్ షాక్..!?

Update: 2019-06-10 05:13 GMT
వైసీపీ అధినేత జగన్ గద్దెనెక్కగానే అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అన్నట్టుగా అమరావతి రాజధాని పేరిట భూములు కాజేసిన టీడీపీ నేతలపై విచారణ జరిపి చర్య తీసుకుంటానన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కుంభకోణాలను వెలికి తీస్తానంటున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది.

ఇప్పటికే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని ముప్పుతిప్పలు పెట్టిన మాజీ స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై కేసులు పెట్టారు. వారు ‘కే’ టాక్స్ పేరిట వసూలు చేసిన అక్రమ సొమ్ముపై విచారణ జరుపుతున్నారు. దీంతో మిగతా టీడీపీ నేతలు, మంత్రులకు భయం పట్టుకుంది.

ఇప్పుడు జగన్ చూపు విశాఖపై పడినట్లు కనిపిస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస్ రావు బాగోతం బయటపెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. విశాఖ జిల్లా కేంద్రంగా గత ఐదేళ్లలో జరిగిన భూకుంభకోణాలను వెలికి తీయడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయినట్లు తెలిసింది. అప్పట్లో వైసీపీ విశాఖ భూ కుంభకోణంపై ఆందోళన కూడా చేసింది. మంత్రి గంటా శ్రీనివాస్ రావుకు సన్నిహితులైన భీమిలి నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూసేకరణ చేశారని.. దోచుకున్నారని అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపించారు. ఆందోళనలు చేశారు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రావడంతో విశాఖ భూకుంభకోణాన్ని బయటకు లాగే ఆలోచణలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా విశాఖ భూకుంభకోణంపై అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలిసింది. విశాఖ భూకుంభకోణ పాత్రధారులు, సూత్రధారులను వెలికి తీయడానికి జగన్ రెడీ అయినట్లు తెలిసింది. దీంతో మంత్రి గంటా శిబిరం ఆందోళనగా ఉంది. ఇక టీడీపీ మంత్రులు కూడా తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు.

    

Tags:    

Similar News