ఊహించినదానికన్నా మిన్నగా.. అంచనాలకు మించి సాగుతోంది ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. కడప జిల్లాలో మొదలైన ఆయన యాత్రకు తొలి బ్రేక్ పడింది కోర్టు కేసులు ఎదుర్కొంటున్న జగన్.. న్యాయస్థానం సూచన మేరకు శుక్రవారం తన పాదయాత్రకు బ్రేక్ వేశారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వేళలో రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు చేరుకున్న జగన్.. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందుకు వచ్చారు. సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా కడప జిల్లాకు బయలుదేరారు.
కేసుల విచారణ కోసం ప్రతిశుక్రవారం తమ ఎదుటకు రావాలంటూ న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో గురువారం సాయంత్రం వరకూ తన పాదయాత్రనుకొనసాగించిన జగన్.. శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరటం గమనార్హం. ఓపక్క పాదయాత్ర చేస్తూ మరోవైపు.. కోర్టు వాయిదాలకు హాజరుకావటం ఇబ్బందేనని చెప్పక తప్పదు. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడిన జగన్ కోర్టుకు రావటం గమనార్హం.
ఇక.. జగన్ పై దాఖలైన కేసుల విచారణ విషయానికి వస్తే.. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టిన టీఆర్ కన్నన్.. మాధవ్ రామచంద్రన్.. ఏకే దండమూడి తదితరులను సీబీఐ ఒత్తిడి చేసి జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించినట్లుగా జగన్ తరఫు న్యాయవాది ఆరోపించారు. పెట్టుబడులు వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నా అలాంటి పని చేయలేదంటూ జగన్ తరఫు న్యాయవాది వాదించారు.