బాబు అబద్దాల కథ చెప్పిన జగన్

Update: 2019-07-03 09:03 GMT
ఏపీ సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతి, పక్షపాతానికి దూరంగా పరిపాలిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో ఎంత పారదర్శకంగా ఉండాలో చూపిస్తున్నారు. ఈసారి గెలిచిన 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్త వారు కావడంతో అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనే దానిపై తాజాగా జగన్ వారికి దిశానిర్ధేశం చేశారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన జగన్ సంచలన కామెంట్స్ చేశారు. సభలో తప్పు చేయవద్దని, అవాస్తవాలు చెప్పొద్దని ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉనప్పుడు చంద్రబాబు కావాలనే ఓ ప్రాజెక్టుపై నకిలీ డాక్యుమెంటరీని అసెంబ్లీలో చూపించారని.. అది తప్పు అని చెప్పి నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలు డాక్యుమెంటరీని ప్రదర్శించారని జగన్ గుర్తు చేసుకున్నారు. అబద్ధాలు చూపిస్తేనే మీరు నిజాలు చెబుతారని అలా చేశానని అప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో చెప్పుకొచ్చారని వివరించారు.. ఇలా బాబు జీవితమే అబద్ధాలతో ప్రయాణమని.. ఆయన ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి అబద్ధాలు కూడా ఆడుతారని.. జాగ్రత్తగా ఉండాలని జగన్ తన ఎమ్మెల్యేలకు సూచించారు..

ఇక అసెంబ్లీలో ప్రతీ ఒక్కరికి మాట్లాడే అవకాశం వస్తుందని.. చేయి లేపి అడగకుండా నిబంధనల ప్రకారం స్పీకర్ ను కోరాలని జగన్ సూచించారు.

    
    
    

Tags:    

Similar News