సంచ‌ల‌నం: బాబుపై రాష్ట్ర‌ప‌తికి జ‌గ‌న్ లేఖ‌

Update: 2017-10-27 13:36 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీలో బ‌ద్నాం కానున్నారా? ఆయ‌న రాజ‌కీయ కుట్ర‌లు ఢిల్లీలోని పెద్ద‌ల‌కు కూడా తెలిసిపోనున్నాయా? ఇప్ప‌టి వ‌ర‌కు మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అని ఢిల్లీలో కితాబులు అందుకున్న చంద్ర‌బాబుకు ఇక నుంచి బ్యాడ్ టైం స్టార్ట్‌యిందా? అంటే ఔన‌నే అంటున్నారు వైసీపీ నేత‌లు - కార్య‌క‌ర్త‌లు. విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే నెల 10 నుంచి ఏపీ అసెంబ్లీ సెష‌న్ ప్రారంభం కానుంది. అయితే, ఈ స‌మావేశాల‌ను బాయ్‌ కాట్ చేయాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. త‌మ పార్టీ నుంచి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి 20 మంది ఎమ్మెల్యేల‌ను సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీలో క‌లిపేసుకోవ‌డంపై జ‌గ‌న్ దండెత్తుతున్నారు.

వారిపై స్పీక‌ర్‌ కు ఫిర్యాదు చేసినా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆరోపించారు. ఈ విష‌యంలో బాబును క‌డిగేయాల‌ని నిర్ణయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకుంటేనే తాము అసెంబ్లీలో అడుగు పెడ‌తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇక‌, జ‌గ‌న్ త‌న ఫైట్‌ ను మ‌రింత ముమ్మ‌రం చేసేందుకు ఈ విష‌యాన్ని రాష్ట్ర‌ప‌తి రామ్‌ నాథ్ కోవింద్‌ కు లేఖ‌రాశారు. దీంతో బాబు దుర్రాజ‌కీయాలు ఢిల్లీలోనూ తెలుస్తాయ‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.  శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని తాము ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో జ‌గ‌న్ ఆలేఖ‌లో వివ‌రించారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే అసెంబ్లీ స్పీకర్‌ - శాసనమండలి చైర్మన్ నుంచి స్పందన రాలేదని  రాష్ట్ర‌ప‌తికి తెలిపారు. ఏపీలో పరిపాలన అన్నది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. గడచిన 41 నెలల్లో 1,09,422 కోట్ల రూపాయల అప్పులు చేశారని వెల్లడించారు. శాసనసభ సమావేశాలను అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తున్నారని, సభలో విపక్షం గొంతు వినపడకుండా నొక్కేస్తున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న ప్రజాస్వామ్య అపహాస్యాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతిని జగన్‌ కోరారు. చంద్రబాబు సర్కారు అక్రమాలు - అరాచకాలను ప్రస్తావిస్తూ మొత్తంగా రాష్ట్రపతికి 5 పేజీల లేఖ రాశారు.
Tags:    

Similar News