చిన్నాన్నను ఘోరంగా హత్య చేశారు...దోషులు బయటకు రావాల్సిందే

Update: 2022-10-21 09:54 GMT
ఫస్ట్ టైం తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ అసలు దోషులను బయటకు తీయాలని వైఎస్సార్టీపీ  ప్రెసిడెంట్, జగన్ సోదరి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఢిల్లీ టూర్ లో ఉన్న ఆమె మీడియాతో ఇదే విషయం మీద మాట్లాడుతూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. వివేకా దారుణ హత్య తమ కుటుంబంలో  జరిగిన ఘోరాతిఘోరమని అన్నారు.

ఈ దర్యాప్తును ఎవరూ అడ్డుకోవడానికి అసలు వీలు లేదని ఆమె స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచి పరిణామమని ఆమె అన్నారు. ఈ విషయంలో అసలు దోషులు తేలాల్సిందే అని ఆమె గట్టిగా చెప్పారు. ఈ దారుణ హత్య వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తాయని షర్మిల చెప్పడం విశేషం.

మొత్తానికి వివేకా దారుణ హత్య విషయంలో ఆయన ఏకైక కుమార్తె సునీతారెడ్డి ఒక వైపు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ కేసు విషయంలో ఏపీలో అయితే దర్యాప్తు సరిగ్గా సాగదని ఆమె భావిస్తూ వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని కోరుకున్నారు. ఇక ఈ కేసు విషయంలో సునీతమ్మ పోరాటానికి షర్మిల పూర్తి మద్దతు ప్రకటించడమే ఇక్కడ విశేషం.

ఇక షర్మిల తన వాంగ్మూలం కూడా ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఇచ్చినట్లుగా ప్రచారం లో ఉంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ  బీటెక్ రవి ఈ మధ్య తెలియచేసారు కూడా. మొత్తానికి చూస్తే ఏపీ నుంచి ఈ కీలకమైన కేసు దర్యాప్తు పొరుగు రాష్ట్రాలని బదిలీ అవడమే ఒక సెన్షేషన్.

ఇక్కడ వివేకా సొంత అన్న కొడుకు జగన్ సీఎం గా ఉన్నారు. న్యాయంగా అయితే ఏపీలో ఈ కేసు తొందరగా తేలాలి. పైగా సొంత కుటుంబీకుడే పాలకుడిగా ఉన్నారు. కానీ మరి ఎందుచేతలో ఈ కేసు చుట్టూ రాజకీయ కారణాలు పులుముకున్నాయి.

దాంతోనే ఇపుడు రాద్ధాంతం అంతా సాగుతోంది. మొత్తానికి వైఎస్ వివేకా కేసు విషయంలో షర్మిల గట్టిగా నిలబడి దోషులు తేలాల్సిందే అని చెప్పడం అంటే ఇది రాజకీయంగా అత్యంత కీలకం అనే చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News