తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ఓ ప్రముఖ టీడీపీ అనుకూల పత్రికలో వచ్చిన కథనం తెలుగు నాట చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొంతమంది పార్టీ నేతలు ఈ అంశంపై స్పందించారు.
అయితే తాజాగా ఈ వార్తలపై వైఎస్ షర్మిల అధికారికంగా స్పందించారు. ఈ విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని.. ఆ కథనాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలుగా షర్మిల అభివర్ణించారు. ఈ కథనాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఏ పత్రిక, ఏ చానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని విమర్శించారు.అది నీతిమాలిన చర్య అన్నారు.
ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన పత్రిక, చానెల్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని వైఎస్ షర్మిల హెచ్చరించారు.ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను షర్మిల విడుదల చేశారు.తెలంగాణలో షర్మిల పార్టీపై ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. షర్మిల ఏపీలోనే పెడితే మేలని..తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని సూచించారు.