ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..? షాకింగ్ ట్వీట్ చేసిందెవరంటే?
ఏ మాత్రం అవకాశం దొరికినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విడిచి పెట్టకుండా విరుచుకుపడుతున్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న ఆమె.. ఇంతవరకు కేసీఆర్ పై ఎవరూ మండిపడనంత తీవ్రంగా ఆమె ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ పాలనపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్న ఆమె.. తాజాగా కేసీఆర్ పై చేసిన వరుస ట్వీట్లతో రాజకీయ దుమారానికి తెర తీశారు.
వ్యాక్సిన్ల కొరత మీద ప్రభుత్వ ఆలసత్వాన్ని ఆమె సూటిగా ప్రశ్నించారు. ‘‘తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ...? మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..?’’ అంటూ మండిపడిన వైనం సంచలనంగా మారింది.
సీఎం కేసీఆర్ మీద కానీ.. వారి కుటుంబ సభ్యుల మీద కానీ ఏ మాత్రం విమర్శలతో విరుచుకుపడినా.. వారిపై వెంటనే మండిపడే గులాబీ నేతలు.. షర్మిల ఎంత తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికి మౌనంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడుతున్నారా? అన్న ఆరోపణలు ప్రభుత్వ ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరీ.. తీవ్రమైన ట్వీట్లకు గులాబీ బాస్.. వారి పరివారం ఎలా రియాక్టు అవుతారో చూడాలి.