అన్న మీద‌ అలిగితే.. అలా చేసేదాన్నిః ష‌ర్మిల

Update: 2021-07-16 11:30 GMT
తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెడ‌తానంటూ ప్ర‌క‌టించిన నాటి నుంచి.. ఎన్నో సందేహాలు, మ‌రెన్నో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఓట్లు చీల్చేందుకు బీజేపీ నేత‌లే ఆమెతో పార్టీ పెట్టించార‌ని కొంద‌రు అంటున్నారు. కాదు.. కేసీఆరే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చేందుకు పార్టీ పెట్టించార‌ని మ‌రికొంద‌రు అనుమ‌నించారు. ఇంకొంద‌రు.. అన్న జ‌గ‌న్ తో విభేదాలు రావ‌డం వ‌ల్లే.. ఆమె తెలంగాణ‌కు వ‌చ్చార‌ని సందేహించారు. ఇలా.. ఎవ‌రికి వ‌చ్చిన సందేహం వాళ్లు వ్య‌క్తం చేశారు. చేస్తున్నారు.

వైఎస్ అభిమానులు కూడా ఈ విష‌య‌మై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. జగన్ కు ష‌ర్మిలకు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని, అన్నాచెల్లెలు ఇద్ద‌రూ విడిపోయారనే పుకార్లు జోరుగా సాగాయి. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ష‌ర్మిల ప్ర‌స్తావించారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మంలో.. ప‌రోక్షంగా ఈ విష‌య‌మై మాట్లాడారు. తొలిసారిగా ఈ అంశంపై మాట్లాడిన ష‌ర్మిల‌.. త‌మ మ‌ధ్య గొడ‌వ‌లు లేవు అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఎవరైనా తమ సోదరుడితో విభేదాలు ఏర్ప‌డితే.. పుట్టింటికి రాకుండా ఉంటార‌ని, వారితో మాట్లాడ‌డం మానేస్తారు అని చెప్పారు. కానీ.. రాజ‌కీయ పార్టీ పెడ‌తారా? అని ప్ర‌శ్నించారు. తాను తీసుకున్న ఈ నిర్ణ‌యం జ‌గ‌న్ తో విభేదాల వల్ల కాదని అన్నారు. త‌న‌ తండ్రి కలలుగన్న తెలంగాణను చూసేందుకే ఈ పార్టీ ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వారికి అండ‌గా నిల‌బ‌డేందుకే.. రాజ‌కీయ పార్టీన స్థాపించిన‌ట్టు చెప్పారు ష‌ర్మిల‌.

ఇక‌, APలో జగన్ పాల‌న‌ గురించి పాజిటివ్ గా స్పందించారు. 'రాజన్న రాజ్యం' తెచ్చేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. అయితే.. అది సాధించ‌లేక‌పోతే మాత్రం ప్రజలు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని అన్నారు. మొత్తానికి త‌మ మ‌ధ్య విభేదాలు లేవు అని చెప్ప‌డానికే ష‌ర్మిల ప్ర‌య‌త్నించారు.
Tags:    

Similar News