వైసీపీ ప్లీనరీ విపక్షమలో ఉన్నపుడు అంటే 2017 జూలై ఎనిమిదిన ఘనంగా నిర్వహించారు. ఆనాడు ప్లీనరీ వేదిక కళకళలాడింది. జగన్ కి ఒక వైపు తల్లి విజయమ్మ, మరో వైపు చెల్లెలు షర్మిలమ్మ కూర్చుని ఉన్నారు. ఇక వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా అపుడే వచ్చిన ప్రశాంత్ కిశోర్ ని అదే వేదిక నుంచి పార్టీ క్యాడర్ కి జగన్ పరిచయం చేశారు. నాడు వెల్లువెత్తేలా జనం వచ్చారు.
అదే విధంగా ప్లీనరీలో జగన్ ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. నాటి ప్లీనరీ ఎప్పటికీ గుర్తుంటుంది. అది ఎలా అంటే ఆ తరువాత అదే ఏడాది నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్రకి ప్లీనరీలోనే భారీ ప్రకటన కూడా చేశారు. మొత్తానికి ప్లీనరీ సూపర్ సక్సెస్ అయింది. మరి ఇన్నేళ్ల తరువాత అంటే దాదాపు అయిదేళ్ల తరువాత వైసీపీ ప్లీనరీ సాగుతోంది.
ఈసారి ప్రత్యేకత ఒకటి ఉంది. పార్టీ అధికారంలో ఉండగా నిర్వహిస్తున్నారు. మరి ఈసారి ప్లీనరీ చూస్తే పీకే కనబడడు, ఆయనతో వైసీపీ ఒప్పందం రద్దు చేసుకుంది. అదే విధంగా చెల్లెలు షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టుకుని అక్కడ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె వైసీపీ ప్లీనరీలో అసలు కనిపించే చాన్స్ లేదు.
ఇక వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ ఉన్నారు. మరి ఆమె ప్లీనరీకి హాజరవుతారా అన్నదే ఇపుడు పార్టీలో చర్చగా ఉంది. ఆమె చాలా కాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పైఇగా కుమార్తె షర్మిలతోనే ఉంటున్నారు. వైఎస్సార్టీపీని అక్కడ గెలిపించాలని ఆమె చూస్తున్నారు. ఆమె వైసీపీలో ఎక్కడా కనిపించడంలేదు.
అసలు ఆమెకు పార్టీ గౌరవ అధ్యక్షురాలి హోదా ఉందా అన్నది కూడా చర్చగా ఉంది. ఆమె ప్లీనరీకి వస్తారా లేక ఎప్పటిమాదిరిగానే హైదరాబాద్ కే పరిమితం అవుతారా అన్నది కూడా ఒక ప్రశ్న. అయితే విజయమ్మ వైసీపీకి అతి పెద్ద ఆస్తి. ఆమె రాకపోతే చాలా చెడు సంకేతాలు అటు పార్టీ జనాలలో ఇటు సామాన్య జనాలలో కూడా వెళ్ళిపోతాయి.
ఆమె వైఎస్సార్ సతీమణి. వైసీపీ ఆత్మ అంతా వైఎస్సార్ చుట్టూనే అల్లుకుని ఉంది. మరి వైఎస్సార్ లో సగం, ఆయన ధర్మపత్ని విజయమ్మ కనుక ప్లీనరీకి రాకపోతే ఆ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుందనే అంటున్నారు. వైసీపీ ప్లీనరీకి జనాలు రావచ్చు, అధికారం ఉంది కాబట్టి గొప్పగా నిర్వహించవచ్చు. ఎంతో మంది అతిధులు కూడా రావచ్చు. కానీ విజయమ్మ రాకపోతే ఇంత పెద్ద ప్లీనరీ కూడా ఏమీ కాకుండా మిగిలిపోతుంది అనే అంటున్నారు.
ఇదిలా ఉండగా తాను గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లుగా విజయమ్మ ఆ మధ్య చెప్పారని, జగన్ వద్దని తిరస్కరించారని, కనీసం ప్లీనరీ వరకు అయినా కంటిన్యూ కావాలని కోరారని ప్రచారం అయితే ఉంది. అదే కనుక చూసుకుంటే విజయమ్మ ప్లీనరీకి హాజరైన తరువాతనే తన పదవికి రాజీనామా చేస్తరని అంటున్నారు. అలా కాకుండా వయా మీడియాగా జగన్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించినపుడు గౌరవ అధ్యక్ష పదవి లేకుండానే చూడడం ద్వారా విజయమ్మ కోరుకున్నది నెరవేరుస్తారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ప్లీనరీ ప్రకటంతో అందరి చూపూ విజయమ్మ మీద పడింది. ఆమె వచ్చినా ఆసక్తే రాకపోయినా సంచలనమే.