వైఎస్ కు నివాళి : ఎలాంటి మహనీయుడంటే...

Update: 2016-09-02 05:18 GMT
తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మహనీయుడిగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆచంద్ర తారార్కంగా ఉంటారు. ఆయన ఒక పార్టీకి చెందిన నాయకుడే అయినా.. ప్రజలందరినీ బిడ్డల్లా చూసుకుని - పార్టీరహితంగానే వారి ప్రేమను పొందగలిగారు. ప్రజల సేవలోనే ఉంటూ.. తన తుదిశ్వాస కూడా విడిచారు. ఆ మహనీయుడు మరణించి ఇవాళ్టికి ఏడు సంవత్సరాలు అయ్యాయి. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి 7వ వర్దంతి. అయితే రాజశేఖర రెడ్డి సీఎంగా ప్రజా సంక్షేమమే తన ఎజెండాగా - జీవితంగా బతికారు. నిత్యం వారికోసమే తపన పడుతూనే మరణించారు. అయితే ఈ ప్రభుత్వాల్లో ఆ ప్రజల పట్ల కన్సర్న్ తగ్గిపోయింది. ప్రభుత్వాలు మరీ ఘోరంగా తయారవుతున్నాయి.

ప్రత్యేకించి ప్రస్తుతం చంద్రబాబునాయుడు సర్కారు నడుస్తున్న తీరు గమనిస్తే.. ఆ మహనీయుడి పాలనతో చాలా వ్యత్యాసాలు తెలిసి వస్తాయి.

- ఎక్కడినుంచి ఫోన్‌ చేసినా కుయ్‌.. కుయ్‌.. కుయ్‌.. మంటూ వస్తూ ఉండే 108 రాజీవ్‌ ఆరోగ్యశ్రీ లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించాలనే వైఎస్సార్‌ స్ఫూర్తిని చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారంగా మార్చేసింది.

- ఎలాంటి కష్టాలతో గత్యంతరం లేని నిరుపేదలు తనకు దరఖాస్తు చేసుకున్నా కూడా.. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అత్యధిక సంఖ్యలో సాయం అందించిన ఘనత వైఎస్సార్‌ ది. సాయం అర్థిస్తే.. అందులో అబద్ధాలు ఉన్నాయేమోనని వెతికే డిటెక్టివ్‌ పనులు ఆయనకు చేతకావు.

- పేదవాడు కన్నీళ్లు పెట్టకుండా ఉండాలన్నది ఒక్కటే వైఎస్సార్‌ ఎజెండా. పేద రైతు ఎప్పుడూ సుభిక్షంగా చిరునవ్వుతో ఉండాలనే ఆయన కోరుకున్నాడు.

- తన ప్రభుత్వ హయాంలో రుణమాఫీ వస్తే.. ఒకేసారి మొత్తం రుణాలను మాఫీ చేసేసిన హీరో వైఎస్సార్‌. అంతే తప్ప విడతలుగా ఇస్తా అని సాకులు చూపించి.. జీవితాంతమూ రైతుల్ని తనకు బానిసలుగా ఉంచుకోవాలని చూసే చంద్రబాబు చిన్న బుద్ధులు వైఎస్సార్‌కు లేవు.

- తన శత్రువులు అయినా సరే.. వారు అవసరంలో ఉన్నప్పుడు తనకు చేతనైనంత ఆదుకోవాలని చూసే మంచి మనీషి, మనసున్న వాడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి.

- మహానేతకు జనం గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఆయన ను వారి గుండెల్లో నుంచి తొలగించడం వెయ్యిమంది చంద్రబాబులు వచ్చినా సరే వారికి అసాధ్యం.

అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో తనకంటూ ఎప్పటికీ ప్రత్యామ్నాయం ఉండదు అనేంత గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కు నివాళి.

Tags:    

Similar News