పేదరికం కారణంగా పిల్లలను బడికి పంపలేకపోతున్నామన్న భావన ఏ ఒక్క తల్లికి రాకుండా చేస్తానని పాదయాత్రలో భాగంగా ప్రకటించిన మేరకు వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నట్లుగానే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి అమ్మ ఒడి పేరిట ఏటా రూ.15000 అందజేస్తానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ముగిసిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్... 20 రోజుల క్రితం నవ్యాంధ్రకు సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న జగన్... ఇప్పటికే పలు ప్రకటనలు చేశారు. తాజాగా అమ్మ ఒడి పథకంపైనా జనంలో ఉన్న అయోమయాన్ని దూరం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లుగా ఆ ప్రకటనలో సీఎంఓ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అలా బడికి పంపే తల్లులు... ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నా, ప్రైవేట్ పాఠశాలను ఎంచుకున్నా కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లుగా ఆ ప్రకటన తేల్చి చెప్పింది.
ప్రైవేట్ పాఠశాలలకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాశనం అవుతుందన్న వాదన వినిపించింది. ఈ క్రమంలో అటు ప్రైవేట్ పాఠశాలలు చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్న వైనంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ కథనాల నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు జగన్ సర్కారు ఒప్పుకోకపోవచ్చంటూ కథనాలు వచ్చాయి. ఇందులో భాగంగానే తొలుత ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అయితే ప్రైవేట్ పాఠశాలల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో అమ్మ ఒడి అమలుపై అయోమయం నెలకొంది. అయితే ఆ అయోమయాన్ని పటాపంచలు చేస్తూ సీఎంఓ ఫుల్ క్లారిటీతో కూడిన ప్రకటనను జారీ చేసింది. అంటే... పిల్లలను బడికి పంపే ప్రతి పేద కుటుంబానికి కూడా అమ్మ ఒడి వర్తిస్తుందన్న మాట.
ఇక అదే సమయంలో సర్కారీ విద్యా వ్యవస్థను మరింతగా బలోపేతం చేసే చర్యలకు కూడా శ్రీకారం చుడుతున్నట్లుగా కూడా సీఎంఓ ఆ ప్రకటనలో వెల్లడించింది. ముందుగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించింది. *దేశం మొత్తంలో నిరక్షరాస్యుల సగటు 26 ఉంటే.. ఏపీలో 33 శాతం ఉంది. మన రాష్ట్రంలో ప్రతీ 100 మందిలో 33 మంది నిరక్షరాస్యులే. అక్షరాస్యత విషయంలో ఏపీ దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి.. పేద కుటుంబాల్లోని పిల్లలు చదువుకునే విధంగా ఈ పథకాన్ని ప్రకటించారు* అని అమ్మ ఒడి పథకం ఆవశ్యకతను వివరించింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదని, పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి ఈ పథకం వర్తిస్తుందని సీఎంఓ స్పష్టం చేసింది.