శ్రీకాకుళంలో దారుణం.. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం

Update: 2020-10-07 15:00 GMT
టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి చెందిన దివంగత మహానేతకు అవమానం జరిగింది. కొందరు దుండగులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి కిందపడేయడంపై వైసీపీ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి.

శ్రీకాకుళంలో గుర్తు తెలియని దుండగుల దాడిలో మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసమైంది. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విగ్రహాన్ని పెకిలించి కిందపడేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

సెప్టెంబర్ 2న డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పాలకొండ ఎమ్మెల్యే కళావతి, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఈ ఘటనను ఖండించారు. విగ్రహం ఏర్పాటు విషయంలో ఎటువంటి వివాదం లేదని.. ఈ విగ్రహం ఎవరు ధ్వంసం చేశారో చెప్పాలంటూ వైసీపీ నేతలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News