ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతం కావాలని వైసీపీ నేతలు వినూత్న రీతిలో ఆకాంక్ష వ్యక్తం చేశారు. సాధారణంగా తమ కోరికలు తీరితే మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. అయితే, వైఎస్ఆర్‌సీపీ గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ యువ నేత ఐవీ రెడ్డి మాత్రం... జగన్ ప్రజా సంకల్పం నెరవేరాలని మనఃపూర్వకంగా దేవుడికి ముందే తన మొక్కు చెల్లించి కోరిక కోరారు. జగన్ కావాలి - జగన్ రావాలి అంటూ ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. గిద్దలూరులోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐవీ రెడ్డి మొక్కుకు మద్దతు ఇస్తూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఐవీ రెడ్డి స్వామి వారికి 1001 కొబ్బరికాయలు కొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే నగరంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అలంకరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు చెన్నువిజయ - బి బాల్ రెడ్ - సి. బాలనాగిరెడ్ - ఎం.గురుప్రసాద్ సహా పలువురు పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.