వలంటీర్ల పోస్టులను చాలా మంది చాలా తక్కువ స్థాయిగా చూస్తూ ఉన్నారు. ఐదారు వేల రూపాయల జీతభత్యాలు అంటే తక్కువ అనే ఫీలింగ్ కొంతమందిలో ఉంది. అలాగే ఆ హోదాలో చేయాల్సిన పనులు కూడా గట్టిగానే ఉన్నాయి. ప్రతి ఇంటికీ తిరిగీ ప్రభుత్వ పథకాల అమలులో భాగం కావాలి.
అలా తిరగడాన్ని పల్లెల్లో చాలా మంది అవమానంగా భావిస్తారు కూడా. ఇలాంటి నేపథ్యంలో ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కూడా కొంతమంది ఇష్టం చూపడం లేదు.
ఆ సంగతలా ఉంటే.. కొన్ని చోట్ల మాత్రం ఆ పోస్టుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఆ పోస్టుల కోసం కొందరు చాలా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో అలాంటి గొడవలు చెలరేగాయి.
అందులో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ సంగతలా ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వాలంటీర్ పోస్టుల కోసం తీవ్రమైన రచ్చ జరుగుతూ ఉండటం గమనార్హం. ఆ జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి వాలంటీర్ల పోస్టుల రాజకీయం తీవ్ర స్థాయికి చేరింది.ఈ విషయంలో కత్తులు దూసుకుంటున్నారు ఆశావహులు.
ఆ రచ్చ ఎంత వరకూ వెళ్లిందంటే.. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇంటి మీదకు కొంతమంది దండెత్తారు. వాలంటీర్ పోస్టులను ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వాళ్లకు అమ్మేసుకున్నారని అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే రచ్చకు ఎక్కడం గమనార్హం.
ఇందుకు సంబంధించి రవీంద్రనాథ్ రెడ్డి ఇంటి మీదకు కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే వెళ్లి రచ్చ చేశారు. నానా హంగామా చేశారు. మొత్తానికి వాలంటీర్ పోస్టుల కోసం పోటీ ఏ స్థాయిలో ఉందో ఈ పరిణామాలను గమనించి అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.