మీరు కష్టపడండి...మేము అనుభవిస్తాం : వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ వర్సెస్ వైసీపీ హై కమాండ్
వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ లో తీరని అసంతృప్తి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు మమ్మల్ని అసలు ఏ మాత్రం పట్టించుకోరా అంటూ రాసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైసీపీని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అంటే 2012 నుంచి 2019 దాకా పార్టీ కోసం నానా రకాలుగా త్యాగాలు చేస్తూ కష్టాలు పడి మరీ పనిచేసిన వారున్నారు. తమ ఆస్తులు అన్నీ కూడా ధారపోసిన వారు ఉన్నారు. అలాగే పార్టీ అంటే చొక్కా చించుకున్న వారు ఉన్నారు.
తమకు ఉన్నదంతా ఖర్చు చేసి జగన్ సీఎం కావాలని ఆరాటపడిన వారు ఎందరో ఉన్నారు. ఇపుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. మూడేళ్ళు అయింది కూడా. అయినా పార్టీ కోసం కష్టపడే వారు ఎవరు, షో చేస్తున్న వారు ఎవరు అన్న దాని మీద హై కమాండ్ దృష్టి పెట్టిందా అని సోషల్ మీడియా వైసీపీ యాక్టివిస్టులు అడుగుతున్నారు. ఇక వైసీపీ ఈ మధ్య సోషల్ మీడియా వింగ్ ని ఏర్పాటు చేసుకుంది. అందుకో 130 ప్లస్ కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించింది.
వీరికి విజయవాడలో రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి చెప్పినది ఏంటి అంటే సోషల్ మీడియా వింగ్స్ ని గ్రామ మండల స్థాయిల దాకా ఏర్పాటు చేయమని. అయితే ఈ పని చేయాలంటే జిల్లాల స్థాయిలలో నియమితులైన వారు అంతా గ్రామాల దాక తిరగాలి. ప్రతీ చోటా వింగ్స్ ని ఏర్పాటు చేయాలి. మరి ఆ పని చేయాలంటే వారికి డబ్బు ఎలా వస్తుంది.
వారు ఏమైనా సంపన్నులా. లేక ఖాళీగా ఉన్నారా. పార్టీ మీద అభిమానంతో వారు వచ్చారు. అలా వచ్చిన వారిలో నూటికి తొమబై శాతం మాంది ఆర్ధికంగా ఏ విధమైన అండ లేని వారే. మరి వారిని మీ చావు మీరు చావండి అని చెప్పేసి ఊరుకోవడం తగునా అన్న చర్చ వస్తోంది. ఇక అలా పై స్థాయిలో ఉన్న వారు ఎవరైనా ఉచితంగా సేవలు చేస్తున్నారా అంటే లేనే లేదు.
పై స్థాయిలో తీసుకుంటే డిజిటల్ మీడియా పేరిట చాలా మంది పెద్ద జీతాలే తీసుకుని పని చేస్తున్నారు. మరి వారికి జీతాలు ఇస్తూ మేపుతున్న వైసీపీ పెద్దలు సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్ల విషయం వచ్చేసరికి ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. అంతే కాదు, ఉన్నత స్థానాలలో ఉన్న వారు పార్టీ ద్వారా ప్రయోజనాలు పొందుతూ అన్ని రకాలుగా లాభాలను కూడా అందుకుంటున్న వారే. అదే ఇపుడు కొత్తగా నియమించిన వారిని మాత్రం పూర్తిగా గాలికి వదిలేయడం ఎంతవరకూ సమంజసం అని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇక ఇక్కడ టీడీపీ విషయానికే వస్తే ఐటీడీపీ అని సోషల్ మీడియా వింగ్ ని ఏర్పాటు చేసుకుని నడుపుతోంది. వారికి జీతాలు కూడా ఇస్తోంది. మరో వైపు జనసేన తీసుకుంటే ఒకే ఒక సీటు ఆ పార్టీకి ఉంది. అయినా సరే సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఐ ఫోన్లు ఇచ్చి కార్యక్రమాలు సక్సెస్ ఫుల్ గా జరిపిస్తోంది. మరి అధికార పార్టీగా ఉన్న వైసీపీకి ఏమి వచ్చిందని తమకు ఏమీ ఇవ్వకుండా ఉచితంగా చేయండి అనడం అని సోషల్ మీడియా యాక్టివిస్టులు గొల్లుమంటున్నారు.
నిజానికి వైసీపీ అధికారంలో ఉంది. నాడు పార్టీ కోసం పనిచేసిన వారిని కష్టపడిన వారిని ఈ రూపేణ అయినా ఆదుకోవాలి కదా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక ఇపుడు అధికారంలో ఉన్న వారు అంతా మేము అన్నీ అనుభవిస్తాం, మరోసారి పార్టీ అధికారంలోకి రావడం కోసం మీరు కష్టపడండి అని చెప్పడం ఎంతవరకూ న్యాయమని కూడా వారి నిలదీస్తున్నారు.
మేము ఎంజాయ్ చేస్తాం, మీరు కష్టపడండి అంటూ ఇలా చేయడం బాగోలేదు అంటూ వైసీపీలో ఎవరు పెట్టారో తెలియదు కానీ ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో రాసినవి అన్నీ కూడా అక్షర సత్యాలే అని అంతా ఏకీభవిస్తున్నారుట. పైగా టీడీపీ జనసేన తమ సోషల్ మీడియా వింగ్ ని బాగా చూసుకుంటున్నారు అని రాయడం వైసీపీకి కారం పూసినట్లే అంటున్నారు.
ఏది ఏమైనా సీన్ చూస్తే వైసీపీ సోషల్ మీడియా వింగ్ అని వేసింది కానీ పార్టీలో ఉన్న అసంతృప్తి మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉంది అంటున్నారు. ఈ అసంతృప్తిని సరిగ్గా అంచనా వేసి చక్కదిద్దకపోతే మాత్రం వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.