టీడీపీ త‌ప్పులే.. అనంత వైసీపీ చేస్తోందా..?

Update: 2022-12-20 00:30 GMT
2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నేత‌లు చేసిన త‌ప్పులనే ఇప్పుడు అనంత‌పురం వైసీపీ నేత‌లు కూడా చేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అప్ప‌ట్లో టీడీపీ నేత‌లు. బ‌ల‌మైన కంచుకోట వంటి జిల్లాలో ఎవ‌రికి వారుగా వ్య‌వ‌హ‌రించారు. ఆధిప‌త్య ధోర‌ణులు కూడా ప్ర‌ద‌ర్శించారు. ఉమ్మ‌డి అనంత‌పురం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్ర‌భాక‌ర్ చౌద‌రి రోడ్డెక్కారు.

చిన్న‌పాటి స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించుకోలేక ప‌రిటాల సునీత మంత్రిగా అప్ప‌ట్లో విఫ‌ల‌మ‌య్యారు. ప‌లితంగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌ల‌చ‌న అయింది. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ విస్త‌రించింది. ఇది టీడీపీకి బ‌ల‌మైన జిల్లా అని తెలిసిన వైసీపీ నాయ‌కులు ఇప్పుడు ఏం చేయాలి.? క‌ల‌సి క‌ట్టుగా ముం దుకు న‌డ‌వాలి. జిల్లాను అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డిపించాలి.

కానీ, అలా చేయ‌డం లేదు. దీంతో పార్టీలో అస‌మ్మ‌తి పెరిగిపోయింది. ఏకంగా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మ‌క్షంలోనే ఎమ్మెల్యేలపై చెప్పులు విసిరే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇది ఒక‌చోట అనుకుంటే స‌రిపుచ్చుకోవ‌చ్చు. కానీ, పెనుకొండ నుంచి క‌దిరి వ‌ర‌కు ప‌రిస్థితి ఇలానే ఉంది. హిందూపురంలో అయితే.. డిష్యుం డిష్యుం సినీమా ఫైట్ల‌ను త‌ల‌పిస్తోంది. దీనిని త‌గ్గించేందుకు ఏం చేయాలా? అని మంత్రి పెద్ది రెడ్డి ఆలోచ‌న చేస్తున్నారు.

కానీ, ఆయ‌న ప‌రిధి కూడా దాటిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్ప‌టికిప్పుడు ఈఅస‌మ్మ‌తిని త‌గ్గించాలంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దాదాపు 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో 7 చోట్ల కొత్త‌వారిని నియ‌మించాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. మ‌రి దీనికి సిట్టింగులు ఒప్పుకొంటారా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. పోనీ.. వీరినే కొన‌సాగిస్తే.. ఇప్పుడున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించ‌డం ఎలా? అనేది కూడా ప్ర‌శ్న. ఏదేమైనా.. గ‌తంలో టీడీపీ నేత‌లు చేసిన త‌ప్పులు వైసీపీ నేత‌లు ఇప్పుడు చేస్తున్నారు. దీనికి రివ‌ర్స్‌లోటీడీపీ నేత‌లు.. అనంత‌ను గెలుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News