యామిని సాదినేని చీప్ ట్రిక్స్.. బుట్టలో పడుతున్న వైసీపీ సైన్యం!

Update: 2019-06-10 08:36 GMT
ఆమె కు కావాల్సింది పబ్లిసిటీ. అది నెగిటివ్ అయితేనేం, మరో రకంగా అయితేనేం! సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని పాపులారిటీ సంపాదించుకోవాలని ఆమె అనుకుంటోంది. అందుకు అనుగుణంగా ఆమె పోస్టులు కొనసాగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వీరనారిగా ఆమె పేరు తెచ్చుకోవాలని అనుకుంటోంది. ఇలాంటి క్రమంలో ఇన్ని రోజులూ  రకరకాల ఎత్తుగడలను ఫాలో అయ్యింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కూడా కోల్పోయింది. ఇలాంటి క్రమంలో ఆమెను పట్టించుకోవాలంటే మరింత లేకిగా దిగిపోవాలని ఆమె అనుకుంటున్నట్టుగా ఉన్నారు. ఆ క్రమంలో ఆమె అడ్డగోలుగా పోస్టులు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని స్పష్టం అవుతోంది.

మామూలుగా విమర్శిస్తేనో, మరో రకంగా పోస్టులు పెడితేనే తనను పట్టించుకునే వాళ్లు ఉండకపోవచ్చు. అందుకే ఆమె వేరే మార్గాన్ని ఎంచుకుంది. అడ్డగోలు పోస్టులతో, లేకి మాటలతో తన పోస్టులు వైరల్ అయ్యేలా చేసుకుంటోందామె. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే..యామినేని సాదినేని అనే ఆ తెలుగు మహిళకు బాగా పాపులారిటీ ఇస్తున్నది ఎవరో కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు.

ఆమె పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్లను తీసి వాటిని తీసుకెళ్లి తమ వాల్ మీద పోస్టు చేసుకొంటూ.. ఆమెకు కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే. తాము అపరిమితంగా ఆమెను ద్వేషించేస్తూ, ఆమెకు కావాల్సిన పాపులారిటీ ఇస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎలాగైతేనేం యామిని సాదినేని లక్ష్యం నెరవేరుతూ ఉంది. ఆమె అడ్డగోలుగా పోస్టులు పెడితే వాటిని వైరల్ చేసే బాధ్యతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీసుకున్నారు. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  సోషల్ మీడియా సైన్యం  యామిని సాదినేని ట్రిక్ తో ఆమె బుట్టలో పడిపోయింది.

ఆమె పెట్టిన పోస్టులపై వీరావేశంతో విరుచుకుపడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆమెకే పాపులారిటిని పెంచుతూ ఉన్నారు అని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ  అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. యామిని సాదినేని విషయంలో ఎలా వ్యవహరించారో వైఎస్సార్సీపీ శ్రేణులే అర్థం చేసుకోవాలి.
Tags:    

Similar News