పోయినోడికి బాధ మామూలే. కానీ.. ఇప్పుడా బాధ రెట్టింపు అయ్యింది. సొంతపార్టీకి చెందిన నేతలు అధినేత సోదరి చేతి ఉంగరాన్ని కొట్టేసిన వైనం జగన్ పార్టీ నేతల్ని డిఫెన్స్ లో పడేస్తే.. దొరికిందే సందు అన్న తరహాలో తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు.ఒక పార్టీ సమావేశానికి హాజరయ్యే వారంతా ఆ పార్టీకి చెందినోళ్లే అనుకోవటం తప్పే అవుతుంది.
ఇలాంటి పనికి రాని చెత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చిన తెలుగు తమ్ముళ్ల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయానికి గుడ్డు మీద ఈకలు పీకే తీరులో తమ్ముళ్ల వీరంగం మామూలుగా లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలీబాబా 40 దొంగల పార్టీ అని.. దొంగలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉన్నట్లుగా టీడీపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు.
జగన్ సోదరి ఉంగరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలే కొట్టేసినట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చిత్రమైన వాదనను తెలుగు తమ్ముళ్లే చేయగలుగుతారు. సభలకు.. రోడ్ షోలకు హాజరయ్యే వారంతా పార్టీ కార్యకర్తలు.. అభిమానులు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అంతేనా.. పార్టీలకు అతీతంగా హాజరయ్యే వారు కొందరుంటారు.
ప్రత్యేకించి ఇలాంటి పనులు చేసి ఇబ్బంది పెట్టేందుకు స్పెషల్ గా సిద్ధమయ్యేటోళ్లకు తక్కువ ఉండదు. ఇప్పుడు షర్మిల ఉంగరం పోయిన వైనానికి పస లేని పనికి రాని వాదనను తెర మీదకు తీసుకురావటం సబబుగా లేదన్న మాట వినిపిస్తోంది. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు కానీ.. ఇలా అయిన దానికి కాని దానికి మైకుల ముందుకొచ్చి మాట్లాడటం సభ్యత అనిపించుకోదన్న విషయాన్నితమ్ముళ్లు గుర్తిస్తే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.