జ‌గ‌న్ నిర్ణ‌యం బెడిసికొడుతోందిగా.. ఈసీ తిప్పికొట్టిన ఆదేశాలు!

Update: 2022-12-20 05:30 GMT
ఏపీ సీఎంజ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం బాగుంద‌ని.. ఒక‌వైపు ఉద్యోగులు చెబుతున్నారు. ఇక‌, ఇది ఏ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణ‌య‌మైనా.. ఎన్నిక‌ల వేళ త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని అధికార పార్టీ నేత‌లు చంక‌లు గుద్దుకున్నారు. అయితే.. అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే ఇబ్బంది ఉండేది కాదు. కానీ... అలా జ‌ర‌గ‌లేదు. రివ‌ర్స్ అవుతోంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను తిప్పికొట్టిందని స‌మాచారం.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో పోలింగ్ బూత్‌ల‌లో కూర్చుని.. ఓటింగ్‌ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించేందుకు కొన్ని ద‌శాబ్దాలుగా టీచ‌ర్ల సేవ‌ల‌ను వినియోగిస్తున్నారు.

అదేస‌మ‌యంలో ఇత‌ర విభాగాల కు చెందిన ఉద్యోగుల‌ను కూడా వాడుకుంటున్నారు. వీరికి ప్ర‌త్యేకంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉంచి రోజుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం రూ.1500 వేత‌నంగాను, రూ.400 ఇత‌ర అల‌వెన్సులుగాను ఇస్తున్నారు.

అయితే, త‌మ‌కు ఎన్నిక‌ల విధులు వ‌ద్ద‌ని.. కొన్నాళ్లుగా ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. కానీ, ఎన్నిక ల‌స‌మ‌యంలో మాత్రం.. ఆయా విధులు నిర్వ‌హించేందుకు అంతో ఇంతో ప‌రిజ్ఞానం ఉన్న వారు కావాలి. పైగా చ‌దువుకున్న వారే అవ‌స‌రం. ఇంత మందిని స‌మ‌కూర్చ‌డం అంటే ఏ ప్ర‌భుత్వానికి సాధ్యంకాదు. అందుకే.. వారు వ‌ద్ద‌న్నా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఉపాధ్యాయుల‌నే ఈ విధుల‌కు కేటాయిస్తున్నారు.

ఇక‌, ఏపీలో ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌ష‌భుత్వం వీరిని ఆ ఎన్నిక‌ల విధుల నుంచి త‌ప్పించింది. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌ని.. ఈ క్ర‌మంలో వారికి ఎన్నిక‌ల‌విధులు అప్ప‌గిస్తే.. త‌మ పుట్టి ముంచుతార‌ని భావించిన వైసీపీ స‌ర్కారు.. వారి డిమాండ్‌నే అడ్డు పెట్టుకుని.. స్వామి కార్యం.. స్వ‌కార్యం అన్నట్టుగా ప‌క్క‌న పెట్టింది. ఇదే నిర్ణ‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించింది.

అయితే.. అక్క‌డి అధికారులు.. 'ఇలా కుద‌ర‌దు. ఉపాధ్యాయుల సేవ‌ల‌ను భ‌ర్తీ చేయ‌గ‌ల యంత్రాంగం ఈసీ ద‌గ్గ‌ర‌లేదు. సో.. వారినే ఎన్నిక‌ల విధుల‌కు కేటాయించాలి'' అని తిరుగు ట‌పాలో స‌మాధానం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే..య‌ధాలాపంగా.. వైసీపీ సర్కారు ఈ ఆదేశాల‌ను కూడా తొక్కి పెట్టింద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి దీనిపై వైసీపీ ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News