అంచనాలు నిజమవుతున్నాయ్. ఎగ్జిట్ పోల్స్ వాస్తవంగా మారింది. అంచనాలకు మించిన ఫలితాలతో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఫ్యాన్ గాలి హైస్పీడ్ కు సైకిల్ నిలవటం కష్టంగా మారింది. కౌంటింగ్ ప్రారంభమై గంటన్న మాత్రమే అయినప్పటికీ..టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య అధిక్యతల అంతరం ఎంతకూ తొలగించలేని రీతిలో ఉందని చెప్పక తప్పదు.
ఇప్పటివరకూ 121 స్థానాల అధిక్యతలు బయటకు రాగా.. అందులో 101 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా పరుగులు తీస్తుంటే.. తెలుగుదేశం పార్టీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే కొనసాగుతున్న పరిస్థితి. తాజాగా వెలువడుతున్న అధిక్యతలు చూస్తే.. జగన్ కు ల్యాండ్ సైడ్ విక్టరీ పక్కా అన్న విషయం క్లారిటీ వచ్చేస్తున్న పరిస్థితి.
ఏపీలో 13 జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ జగన్ పార్టీ తన అధిక్యతను సంపూర్ణంగా ప్రదర్శిస్తోంది. ఇదే తీరులో కానీ అధిక్యతలు కొనసాగిన పక్షంలో.. ఇప్పటివరకూ గరిష్ఠంగా వేసుకున్న 120 స్థానాల కంటే మించిన స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా వెలువడుతున్న కౌంటింగ్ అధిక్యతల్ని పరిశీలిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తక్కువలో తక్కువ 140 స్థానాలకు మించి గెలుపు ఖాయమని చెప్పక తప్పదు. అంచనాలకు మించి ఏపీ ప్రజలు జగన్ కు పట్టం కట్టేలా ఓట్లు వేశారన్న అభిప్రాయం కలుగక మానదు.