వైసీపీలో అధిపత్య పోరు.. ఈసారి కారుతో గుద్ది చంపేశారు

Update: 2022-10-10 07:31 GMT
మొన్నటివరకు తమ రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ గా చేసుకున్న ఏపీ అధికార పార్టీ నేతలు..కార్యకర్తలు చేసిన హింసా రాజకీయాల గురించి తెలిసిందే. ఇప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థుల్ని వదిలేసి.. ఇప్పుడు సొంత పార్టీలో తమకు చిరాకు తెప్పిస్తున్న వారిని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. శనివారం రాత్రి ఉమ్మడి అనంత జిల్లాలో జరిగిన దారుణ హత్యను మర్చిపోక ముందే.. తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న హత్య ఇప్పుడు షాకింగ్ గా మారింది.

రోజు వ్యవధిలోనే ఏపీ అధికార పార్టీలో నెలకొన్న అధిపత్య పోరు.. మరో నిండు ప్రాణాల్ని తీసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఉన్న వ్యక్తిగత గొడవలు.. పార్టీ విభేదాలు వెరసి.. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.

విజయవాడలోని వైసీపీ నేత సురేష్.. అదే డివిజన్ కు చెందిన మరో నేత చౌడేష్ కారుతో ఢీ కొట్టి చంపిన వైనం తాజాగా చోటు చేసుకుంది. బెజవాడ వైసీపీలో హాట్ టాపిక్ గా మారిన ఈ హత్య.. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

విజయవాడలోని ఐదో డివిజన్ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు దేశి సురేశ్. శనివారం రాత్రి ఏడు గంటల వేళలో తన కొడుక్కి ఐస్ క్రీం తీసుకొచ్చేందుకు తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అదే వేళలో వైసీపీ నేత చౌడేష్ మరో నలుగురు స్నేహితులు కలిసి కారులో వెళుతున్నారు. నడుచుకుంటూ వెళుతున్న సురేష్ ను మద్యం మత్తులో వాహనం నడుపుతున్న చౌడేష్ ఢీ కొట్టేశాడు. చుట్టుపక్కల ఉన్న వారు కేకలు వేయటంతో అతగాడు పరారయ్యాడు.

సురేష్ మచిలీపట్నం ఆర్టీవో ఆఫీసులో ప్రైవేటు డ్రైవర్ గా పని చేస్తుంటే.. నిందితుడు చౌడేష్ ఐటీ ఉద్యోగిగా ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీలో తిరుగుతుంటాడు. 2020లో వీరిద్దరి మధ్య బ్యానర్ అంశంలో గొడవలుజరిగినట్లుగా చెప్పారు. అప్పట్లో సురేశ్ తన స్నేహితులతో కలిసి చౌడేష్ ను అతడి కొడుకు ఎదుటే కొట్టాడు.

ఆ దాడిని అవమానంగా భావించిన చౌడేష్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. పలుమార్లు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి మధ్య తగదా తీర్చేందుకు రాజీ చేసేందుకు పలువురు ప్రయత్నించినా ఫలించలేదు. తాజాగా చౌడేశ్ తన స్నేహితులతో కలిసి సురేశ్ ను హత్య చేసే వరకు విషయం వెళ్లింది.




దాదాపు అల్లు అర్జున్ ఫైనల్ కథను వినిపించినట్లుగా తెలుస్తోంది. బన్నీకే కథ నచ్చడంతో తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నాడట.
Tags:    

Similar News