వంగవీటి రంగాపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత మల్లాది విష్ణు విస్మయం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం మాట్లాడడం మంచిదికాదని సూచించారు. పార్టీలో ఎవరైనా పార్టీ నియమనిబంధనలను పాటించడమే కాకుండా పార్టీ అధినేత ఆదేశాల మేరకు నడుచుకోవాలని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. 2009 నుంచి 2014 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్న తను రాజకీయ పరిస్థితులు మారడంతో జగన్ నాయకత్వంలో పనిచేయాలన్న ఉద్దేశంతో వైసీపీలో చేరానని వివరించారు. తాను వైసీపీలోకి వచ్చినందుకే గౌతమ్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారనడం కరెక్ట్ కాదని తెలిపారు.
వంగవీటి కుటుంబాన్ని ఉద్దేశించి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రభావం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై పడబోదని మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని అత్యంత ఎక్కువగా గౌరవించేది వైఎస్ ఆర్ కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలుగా ప్రవర్తన తీరును సరిచూసుకోవాలని మల్లాది విష్ణు కోరారు. రాజధాని ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మరింత క్రమశిక్షణతో ఉండాలని మల్లాది విష్ణు కోరారు. ఎవ్వరైనా పార్టీ గైడ్ లైన్స్ ను అతిక్రమిస్తే అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేదని, ఆ మాటలు ఆయన వ్యక్తిగతం అని పార్టీ నేత పార్థసారథి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వంగవీటి రంగా మా నాయకుడని - వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి సన్నిహితుడు అని... రంగాను తాము ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్న పార్థసారథి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని వెల్లడించారు. గౌతమ్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నామని పార్థసారథి తెలిపారు.