దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని వైసీపీ నేతలు మహానేతగా పరిగణిస్తారు. వైసీపీ నేతలే కాకుండా మెజారిటీ జనం కూడా వైఎస్ ను మహానేతగానే పరిగణిస్తారు. వైఎస్ పథకాలతో లబ్ధి పొందిన వారు తమ ఇళ్లల్లో దేవుళ్ల చిత్రపటాల వద్ద వైఎస్ ఫొటోను ఉంచుకుని నిత్యం పూజలు చేస్తున్న వైనం కూడా మనకు తెలిసిందే. ఇదంతా మనందరికీ తెలియనిదేమీ కాదు. అయితే ఇప్పుడు వైఎస్ వర్ధంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వైఎస్ కు నివాళి అర్పించే కార్యక్రమాలను వాడవాడలా చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లోె వైసీపీ శ్రేణులు చాలా ఉత్సాహంగానే కనిపిస్తున్నా... వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు మాత్రం అంతగా కనిపించడం లేదు. ఏదో వైఎస్ వర్థంతి కదా... ఓ చోట వైఎస్ చిత్రపటానికి ఓ దండేసి దండం పెట్టేస్తే సరిపోతుంది కదా అన్న రీతిలో వ్యవహరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు నిజంగానే చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు.
హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ అకాల మరణం చెందితే... ఆ మరణాన్ని తట్టుకోలేక వందలాది గుండెలు ఆగిపోతే... ఆ కుటుంబాలను పరామర్శిస్తానన్న వైఎస్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అడ్డుచెబితే పుట్టిందే... వైఎస్సార్సీపీ. మొత్తంగా వైఎస్ ఆశయ సాధన కోసమే పుట్టిన పార్టీగా జగన్ వైసీపీని పేర్కొన్నారు. అధికారం దక్కినా - విపక్షంలో ఉన్నా... పేద ప్రజలకు అండగా నిలిచే క్రమంలో జగన్ దాదాపుగా తొమ్మిదేళ్లకు పైగానే అధికారానికి దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలో పార్టీలో చేరిన వారంతా పదవులు దక్కినా - దక్కకున్నా కూడా జగన్ అడుగుజాడల్లో నడిచారు. అధికార దాహంతో కొందరు పార్టీని వీడినా మెజారిటీ మంది నేతలు మాత్రం జగన్ వెన్నంటే నడిచారు. ఈ క్రమంలో వైఎస్ వర్థంతి జరిగినా - వైఎస్ జయంతి జరిగినా... జగన్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కవర్ చేసేందుకు మీడియా కిందా మీదా పడేది.
వైఎస్ జయంతి అయినా - వైఎస్ వర్ధంతి అయినా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల కోలాహలమే కనిపించేది. మరి అలాంటిది వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడే అంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడితే... ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిధి మరింత విస్తరించాలి కదా. ముమ్మాటికీ విస్తరించాల్సిందే. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. పార్టీ అధినేత తండ్రి - సంక్షేమ పథకాలకు ఆద్యుడు అయిన వైఎస్ వర్ధంతిని సామాన్య జనం కూడా బాగానే గుర్తు చేసుకుని తమవంతు కార్యక్రమాలు చేపడుతుంటే... ఈ కార్యక్రమాలన్నింటినీ తమ భుజస్కందాలపై వేసుకోవాల్సిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఆ పనిని పక్కన పడేశారు. ఏదో వైఎస్ వర్ధంతి రోజున కనిపించాలి కాబట్టి... వైఎస్ విగ్రహం వద్దకు వచ్చి ఓ దండేసి - ఓ దండం పెట్టేసి మమ అనిపిస్తున్నారు. అసలు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు... ఈ కార్యక్రమాలను తూతూమంత్రంగా నిర్వహించేశారట. ఈ తరహా వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిపడుతున్నాయి.