జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు ఇలా కొట్టేద్దాం..నేత‌ల వ్యూహం ఇదేనా..?

Update: 2019-07-29 16:22 GMT
ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న నాయ‌కులకు ఈ ప‌ద‌వులు ఇచ్చే క్ర‌మంలోనే జ‌గ‌న్ ఓ ష‌ర‌తు పెట్టారు. మీరు కేవ‌లం రెండున్న‌ర సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఈ ప‌ద‌వుల్లో ఉంటారు. త‌ర్వాత వేరేవారు వ‌స్తారు. ఎక్క‌డా అవినీతి అనే మాట వ‌చ్చినా.. మ‌ధ్య‌లోనే మంత్రుల‌ను ఇంటికి పంపిస్తా. మేనిఫెస్టో ఆధారంగానే పాల‌న జ‌ర‌గాలి. ఎవ‌రూ ఎక్క‌డా అవినీతికి పాల్ప‌డ‌కూడ‌దు. ప్ర‌జ‌లు - పార్టీనే ప్ర‌ధాన ల‌క్ష్యాలు అని వారికి సూత్రీక‌రించారు. దీంతో ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారిలో ఓ ముగ్గురు మిన‌హా అంద‌రిలోనూ ఇదే గుబులు పుట్టిస్తోంది. త‌మ‌కు ప‌ద‌వి వ‌చ్చింద‌నే ఆనందం ఒక ప‌క్క ఉండ‌గానే.. ఈ ప‌దవి కేవ‌లం రెండున్న‌రేళ్లేగా! అనే నిట్టూర్పులూ వినిపిస్తున్నాయి.

అయితే, రెండున్న‌రేళ్ల‌కు మించి ఈ ప‌ద‌వుల్లో కొన‌సాగాలంటే ఏంచేయాలి?  ఎలా ముందుకు వెళ్తే.. మంత్రి ప‌ద‌వులు మ‌ళ్లీ రెండున్న‌రేళ్ల వ‌ర‌కు రెన్యువ‌ల్ అవుతాయి? అనే చ‌ర్చ వీరిలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ ను మెప్పిస్తే.. చాలు.. మ‌న‌కే మ‌రో రెండున్న‌రేళ్లు మంత్రి ప‌ద‌వులు ఖ‌చ్చితంగా కొన‌సాగుతాయ‌ని న‌మ్ముతున్న కొంద‌రు మంత్రులు జ‌గ‌న్ ను మెప్పించేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్రాధాన్యాల‌పై దృష్టి పెట్టారు.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌ధానంగా గ‌త ప్ర‌భుత్వం తాలూకు అవినీతిని బ‌య‌ట పెట్ట‌డం - వారిని ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న చేయ‌డంతో పాటు త‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్ల‌డం క‌ర్త‌వ్యాలుగా నిర్ణ‌యించుకున్నారు.
దీనిని గ‌మ‌నించిన వైసీపీ మంత్రులు. జ‌గ‌న్‌ ను మంచి చేసుకునేందుకు - ఆయ‌న వ‌ద్ద మార్కులు కొట్టేసేందుకు వారు గ‌త ప్ర‌భుత్వ లోపాల‌పై దృష్టి పెట్టారు. హోంమంత్రి నుంచి వివిధ శాఖ‌ల మంత్రుల వ‌ర‌కు కూడా ఇదే దృష్టితో ఉన్నారు. దీనివ‌ల్ల ప్ర‌స్తుత పాల‌న‌పై ప్ర‌భావం ప‌డుతోంద‌ని - తొవ్వి తీసేందుకు పెద్ద‌గా ఏమీ లేవ‌ని అధికారులు చెబుతున్నా కూడా మీకెందుకు.. మేం చెప్పిన‌ట్టు చేయండి .. అంటున్న మంత్రులు పెరుగుతున్నారు.

ఏదైనా శాఖ‌లో గ‌త ప్ర‌భుత్వం అవినీతి కి పాల్ప‌డిన‌ట్టు ప్ర‌స్తుత మంత్రి నిరూపించి - వాటిని బ‌హిర్గ‌తం చేయ‌డం ద్వారా చంద్ర‌బాబును ప్ర‌జ‌ల మ‌ధ్య దోషిగా నిల‌బెట్ట‌వ‌చ్చు. త‌ద్వారా అనుభ‌వ‌జ్ఞుడ‌నే చంద్ర‌బాబును ఫూల్‌ ను చేయాల‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. దీని నుంచి తాము జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు సంపాయించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారి ప్ర‌య‌త్నం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.


Tags:    

Similar News