దేశంలో కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న కరోెనాకు పెద్దా చిన్నా అందరూ బాధతులే. ఇప్పటికే 4 వేల మరణాలు దాటాయి. కేసులు 5 లక్షలకు చేరాయి. దీంతో ప్రపంచంలోనే తీవ్రంగా కరోనాకు ప్రభావితమైన ప్రాంతంగా ఏపీని కూడా గుర్తించింది. ఇప్పటికే ఏపీలో పలువురు ప్రముఖులు -ఎమ్మెల్యేలు కరోనా బారి పడ్డారు. ఇటవలే పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. కాకినాడ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి కాస్త విషమించింది. దీంతో బంధువులు కంగారు పడి ప్రభుత్వానికి విషయం తెలపగా... వెంటనే ఆయనను బెంగళూరు తరలించేందుకు హెలికాప్టరు ఏర్పాటుచేశారు.
మెరుగైన వైద్యం కోసం ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయనను బెంగళూరు తరలించారు. ఆయనతో పాటు భార్య కుటుంబ సభ్యులు కూడా ఉణ్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి వైసీపీ తరఫున గెలిచిన దొరబాబుకు శనివారమే కరోనా సోకింది. అయితే, ఆయనకు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎమర్జెన్సీ కింద బెంగుళూరు తరలించారు.
ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో ఏపీలో కరోనాకు అత్యధికంగా ప్రభావితమైన జిల్లా. దీనితర్వాత కర్నూలు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 66,948కి పెరిగింది. ఇప్పటివరకు 427 మంది మరణించారు.