నవ్విపోదురుగాక.. అన్నట్టుగా ఉంది.. వైసీపీ లేడీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా వ్యవహారం. ఎవరైనా ఏదైనా స్పీచ్ ఇస్తే.. తమకంటూ.. ప్రత్యేకత ఉండేలా చర్యలు తీసుకుంటారు. తనకంటే.. ఏదైనా స్పెషల్ చూసుకుంటారు. కానీ, రోజా మాత్రం తాజాగా చేసిన ఉమన్స్ డే స్పెషల్ స్పీచ్ అంతా కూడా `కాపీ కొట్టు.. అదరగొట్టు` అనే స్టయిల్‌లో సాగిందనే వ్యంగ్యాస్త్రాలు వచ్చేలా సాగింది.
తాజాగా ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రోజా మాట్లాడారు. అయితే.. ఇక్కడ ఆమె ఒక్క మాటంటే ఒక్క మాట కూడా సొంతంగా చెప్పిన మాట లేదు. అన్నీ ఇటీవల వచ్చి.. బాలయ్య మూవీ.. అఖండ సినిమాలోని బాలయ్య పేల్చిన డైలాగులనే కాపీ కొట్టి అవే తనకు గొప్ప అన్నట్టుగా రెచ్చిపోయారు.
``నారీ భేరీ సౌండ్.. నారావారి కర్ణభేరీలో రీసౌండ్ రావాలి`` అంటూ.. ప్రారంభించిన రోజా ప్రసంగం ఆద్యంతం కూడా అంతా కాపీ డైలాగులతోనే సాగింది. ఈ సభలో ఆమె మాట్లాడిన తీరును అందరూ నవ్వుకున్నారు. ఎందుంటే.. మహిలా దినోత్సవం రోజు .. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఏం చేసిందనే విషయాన్ని చెప్పుకొంటే సరిపోతుంది. కానీ, ఈ సందర్భంగా కూడా రాజకీయ విమర్శలకే.. ముఖ్యంగా చంద్రబాబును, టీడీపీని, లోకేష్‌ను విమర్శించేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంటి మహిళా పక్షపాతి సీఎం.. దేశంలోనే ఉండరంటూ.. ఆమె చెప్పినా.. ఇక అక్కడి నుంచి అఖండ సినిమాలో పాపులర్ అయినా.. `బోత్ ఆర్ నాట్ సేమ్` అనే డైలాగులతోనే తన స్పీచ్ కొనసాగించారు. ''సీఎం జగన్ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారు. మహిళలను మహారాణులను చేశారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేలా పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మహిళలందరికీ దేవుడితో సమానం'' అని రోజా అన్నారు.
''చంద్రబాబు, లోకేష్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. నారావారి నరకాసుర పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూశారు. టీడీపీ అంటే.. తెలుగు దుశ్సాసన పార్టీ. చంద్రబాబు.. వైఎస్ జగన్ బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు మోసగాడు.. జగనన్న మొనగాడు బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబుకు, వైఎస్ జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది'' అని ఎమ్మెల్యే రోజా అఖండ మార్క్ పంచ్‌లు విసిరారు. మొత్తానికి రోజా స్పీచ్ నవ్వుల పాలైందని సొంత పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం.