న‌గ‌రిలో వైఎస్ ఆర్సీపీ వార్..అధిష్టానానికి రోజా విన్న‌పం?

Update: 2020-03-14 14:30 GMT
చిత్తూరు జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక‌వైపు హ‌వా కొన‌సాగిస్తూ ఉంది. ఆ పార్టీ త‌ర‌ఫున మెజారిటీ స్థానిక సంస్థ‌ల్లో అభ్య‌ర్థులు జ‌య‌కేత‌నం ఎగ‌రేస్తూ ఉన్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏక‌గ్రీవ పోరుతోనే చాలా చోట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అలాంటి వాటిల్లో పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. అక్క‌డ మెజారిటీ ఎంపీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయి. అలా మంత్రి త‌న స‌త్తా చూపిస్తున్న‌ట్టే.

అయితే పెద్దిరెడ్డి ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయిన నేత కాదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఆయ‌న జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం చూపించారు. పార్టీని గెలిపించార‌నే పేరు తెచ్చుకున్నారు. మంత్రి ప‌ద‌విలో ఆయ‌న‌ - ఎంపీగా ఆయ‌న కుమారుడు వైసీపీలో కీల‌క నేత‌లుగా ఉన్నారు.

అయితే ఇప్పుడు మొత్తం చిత్తూరు జిల్లాలోనే తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ల్ల అదే జిల్లాలోని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా కొన్ని ఇక్క‌ట్ల పాల‌వుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంపై కూడా పెద్దిరెడ్డి త‌న ప్ర‌భావాన్ని క‌లిగి ఉన్న‌ట్టున్నారు. ఆయ‌న‌కంటూ అక్క‌డ కొంత క్యాడ‌ర్ ఉన్న‌ట్టుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నిక‌ల్లో అక్క‌డ కూడా కొంత‌మంది త‌న వ‌ర్గం అభ్య‌ర్థుల‌ను పెద్దిరెడ్డి బ‌రిలోకి దించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆర్కే రోజా అధిష్టానం దృష్టికి ఈ అంశాల‌ను తీసుకెళ్లి త‌న వంతుగా కొన్ని సీట్ల‌లో త‌న అనుచ‌ర‌వ‌ర్గాన్ని బ‌రిలోకి దింపింది.

అయితే అక్క‌డితో వ్య‌వ‌హారం సెటిల‌యిన‌ట్టే. అయితే పెద్దిరెడ్డి వ‌ర్గం మీద ఇప్పుడు కొత్త ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. రోజా కోటాలో ద‌క్కిన సీట్ల‌లో పెద్దిరెడ్డి వ‌ర్గం బీజేపీ వాళ్ల‌కు స‌పోర్ట్ చేస్తోంద‌నే ప్ర‌చారం ఒక‌టి సాగుతూ ఉంది. రోజాకు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో చెక్ పెట్టేందుకు ఇలా చేస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతూ ఉంది. ఈ అంశాల‌ను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూ ఉంద‌ట ఆర్కే రోజా. మ‌రి వైసీపీలోని ఈ అంత‌ర్గ‌త పోరు ఎలా ప‌రిష్కారం అవుతుందో!
Tags:    

Similar News