రోడ్డు ప్రమాదాన్ని చూసి ఎమ్మెల్యే ఏం చేశారంటే..

Update: 2018-12-23 05:49 GMT
రోడ్డుపై ప్రమాదం జరిగిదంటే చాలా మంది చూసి అయ్యో పాపమని వెళ్తుంటారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించిన వెంటనే క్షతగాత్రులను స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

కడప జిల్లా రామాపురం మండలం బండపల్లె వద్ద తాజాగా రోడ్డు ప్రమాదం జరిగింది. కడపకు చెందిన ఒక కుటుంబం కారులో వస్తుండగా బండపల్లె గ్రామం సమీపంలో గన్ షాద్ వద్ద   ప్రమాదవశాత్తూ   కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఇంతలో రాయచోటి నుంచి అటువైపు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రోడ్డు పక్కన పల్టీలు కొట్టిన కారును గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపారు. తన సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను ప్రమాదానికి గురైన కారులో నుంచి బయటకు తీశారు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఆలస్యమైతే ప్రమాదమని క్షణం ఆలోచించకుండా వెంటనే నెత్తురోడుతున్న వారిని తన కారులో ఎక్కించుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వయంగా రాయచోటి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉదారతను స్థానికులు, కుటుంబీకులు వెయినోళ్ల పొగిడారు..
    

Tags:    

Similar News