గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందారు.. రఘురామకృష్ణరాజు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ పార్టీతో విభేదించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ వేదికగా తూర్పూరబడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర పన్నడంతోపాటు జాతి విద్రోహ చర్యలకు రఘురామకృష్ణరాజు పాల్పడుతున్నాడని ఆయనపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఆయనను అరెస్టు చేసింది. ఈ క్రమంలో తనపై భౌతిక దాడి చేశారని రఘురామకృష్ణరాజు ఆరోపించడం సంచలనం రేపింది. ఈ క్రమంలో ఆయనకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
అలాగే గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్‌లోని తన ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్నారంటూ సీఐడీ కానిస్టేబుల్‌ను బంధించి దాడికి పాల్పడ్డారని కూడా ఆయనపై మరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రాకుండా ఆయన హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు.
రోజూ రచ్చబండ పేరుతో యూట్యూబ్‌లో వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పై రఘురామకృష్ణరాజు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా దీపావళి పండగ సందర్భంగానూ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. పండుగ చేసుకోవడానికి తనను హైదరాబాద్ రానీయకుండా.. తనను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు తన ఇంటి పరిసరాల్లో మకాం వేశారని మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై ఆయన య్యూటూబ్‌లో రచ్చబండ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. దీపావళి చేసుకోవడానికి తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తే తనను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు కాపు కాశారని ధ్వజమెత్తారు. దీంతో తాను తిరిగి ఢిల్లీకి వెళ్లిపోవలసి వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను ఎద్దేవా చేస్తూ రఘురామకృష్ణరాజు పలు ప్రశ్నలు సంధించడం గమనార్హం. ఇటీవల నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా కార్తికేయ చిత్రంలో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పినదాన్ని పేరడీ చేస్తూ రఘురామ.. జగన్‌పై పలు ప్రశ్నలు సంధిస్తూ మండిపడ్డారు.
– అధికారంలోకి వచ్చిన వారం రోజులలోపే సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి మూడున్నరేళ్ళయినా రద్దు చేయని అతని కన్నా మాట తప్పని యోధుడు ఎవరు?
– మద్యం కాపురాలలో చిచ్చుపెడుతోంది కాబట్టి సంపూర్ణ మద్యనిషేధం విధిస్తానని చెప్పి మడమ తిప్పిన అతని కంటే గొప్ప వ్యక్తి ఎవరు?
– ప్రత్యేక హోదా వస్తే ఆదాయపన్ను చెల్లించక్కరలేదని చెప్పిన అతనికంటే గొప్ప ఆర్ధికవేత్త ఎవరు?
– 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా పట్టుకొచ్చేస్తానని చెప్పిన అతనికంటే గొప్ప పోరాటయోధుడు ఎవరు?
– కేంద్రం నిధులు ఇవ్వకపోతేనేం? రాష్ట్ర నిధులతో పోలవరం కట్టుకోలేమా? అని అడిగిన అతనికంటే గొప్ప ఇంజనీరు ఎవరు?
– అక్రమ కట్టడం పేరిట ప్రజావేదికను కూల్చివేసిన అతని కంటే గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు?
– బ్యారికేడ్లు, పరదాలు, పోలీసుల రక్షణ మద్య ప్రజలను కలిసే గొప్ప వీరుడు ఎవరు?
– రావాలి జగన్.. కావాలి జగన్ అని పాడినవారి చేతే ‘ఒక్క ఛాన్స్ చాలు మహాప్రభో’ అనిపించిన అతని కంటే గొప్ప మ్యూజిషియన్ ఎవరు?
– కాస్కోం.. కిస్కిస్కో వంటి కొత్త పదాలను కనిపెట్టిన అతనికంటే గొప్ప గురువు ఎవరు?
– పచ్చటి రుషికొండకు గుండు కొట్టించేసిన అతని కంటే గొప్ప పర్యావరణ ప్రేమికుడు ఎవరు?
– ఏకంగా 50 మంది సలహాదారులతో పరిపాలన సాగించే అతని కంటే గొప్ప అడ్మినిస్టేటర్ ఎవరున్నారు?
– మూడేళ్ళలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయగలిగిన అతనికంటే గొప్ప ఆర్థిక నిపుణుడు ఎవరున్నారు? అంటూ రఘురామ.. సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు.