రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఉండేది ఢిల్లీలో అయినా ఆయన టాపిక్ మాత్రం ఏపీ గల్లీలలో ఎపుడో ఏదో కారణాన మారుమోగుతూనే ఉంటుంది. పోనీ ఆయన ఏమైనా చరిష్మాటిక్ లీడారా అంటే కాదు, క్రౌడ్ పుల్లరా అంటే అదీ కాదు, ఆయన ఒక పార్టీలో కీలక నేత అంటే అదీ కాదు, జస్ట్ ఎంపీ మాత్రమే. కానీ ఆయన ఢీ కొట్టింది వైఎస్ జగన్ ని. దాంతో అమాంతం ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. ఇక రాజా వారు ఢిల్లీలో కూర్చుని వైసీపీని గిల్లుతారు. ఆయన గిల్లుడికి వైసీపీ ఆమూలాగ్రం అల్లలాడుతుంది.
అంతే కౌంటర్లు రిటార్లు, సెటైర్లు అలా వరసబెట్టి వైసీపీ వైపున వచ్చి పడిపోతాయి. లేటెస్ట్ గా రాజు గారు రాజమండ్రీ వైపు చూస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా రాజు గారు రాజమండ్రీ నుంచి రంగంలోకి దిగుతారు అని వచ్చిన ఈ వార్త ఇపుడు పెను సంచలనం అవుతోంది. దీంతో రాజమండ్రీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైసీపీ నేత మార్గాని భరత్ దీని మీద రియాక్ట్ అయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలను ఆయన బదులిస్తూ ఆయన రాజమండ్రీ వస్తే నాకే రెండు లక్షల మెజారిటీ ఇచ్చి వెళ్తారు అని సంచలన కామెంట్స్ చేశారు.
ఆయనను గెలిపించిన నర్సాపురాన్ని గాలికి వదిలేసిన రాజు గారు రాజమండ్రీ వచ్చి ఏం చేస్తారు అని భరత్ సూటిగా ప్రశ్నించారు. నర్సాపురంలో రెండు ఫ్లై ఓవర్లను ఈ మధ్యనే మంజూరు చేసిన సంగతి అయినా ఆయనకు తెలుసా అని నిలదీశారు. రఘురామరాజు తెల్లారి లేస్తే ఢిల్లీలో కూర్చుని వైసీపీని విమర్సిచడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు. ఇక జాతీయ సర్వేలు వరసబెట్టి ఏపీలో వైసీపీకి మెజారిటీ వస్తుందని చెబుతూంటే రఘురామ ఒక దొంగ సర్వేను రెడీ చేసి జనం మీదకు వదిలారు అని భరత్ మండిపడ్డారు. ఆయన మాటలు ఎవరు నమ్ముతారని కూడా ఎద్దేవా చేశారు.
ఇక పద్నాలుగేళ్ళ పాటు సీఎం గా ఉన్న చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేకపోయారని, ఇపుడు జగన్ దెబ్బకు నెలకు మూడు సార్లు కుప్పం పరిగెత్తుకుని వెళ్తున్నారని భరత్ సెటైర్లు వేశారు. చంద్రబాబు పాలనా అనుభవం ఎలాంటిది అంటే 2019 ఎన్నికల తరువాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం వంద కోట్లను ఖజానాలో వదిలేసి మొత్తానికి మొత్తం ఖాళీ చేసి వెళ్లారని విమర్శించారు.
మరో వైపు జగన్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి వెళ్తే దాని మీద కూడా రాద్ధాంతం చేస్తున్నారని, జగన్ టూర్ తరువాతనే పోలవరం అధారిటీలో కదలిక వచ్చింది అని కూడా భరత్ గుర్తు చేశారు. ఇక మహారాష్ట్ర తరువాత ఎక్కువ జాతీయ రహదాఉలు మంజూరు అయింది ఏపీకే అని ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి ఈ యువ ఎంపీకి రాజా వారు అంటే ఏముందో తెలియదు కానీ రాజా వారికి మాత్రం ఈయన మీద గట్టిగానే ప్రేమ ఉందని చెబుతున్నట్లుంది. అందుకే తన నెత్తిన పాలు పోయడానికే రాజమండ్రీలో పోటీ చేసి తనకు రెండు లక్షల మెజారిటీ రప్పించేలా రాజు గారు చూస్తారేమో అని సెటైర్లు వేశారు. మరి దీని మీద యధాప్రకారం రాజా వారి కౌంటర్ ఉంటుందా.. చూడాలి.