ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టిన వైసీపీ ఎంపీలు!

Update: 2018-06-07 11:17 GMT
``ఇంత‌న్నాడంత‌న్నాడే గంగ‌రాజు...ముంత మామిడి పండ‌న్నాడే గంగ‌రాజు....అస్ప‌న్న‌డు బుస్స‌న్నాడే గంగ‌రాజు....నన్నొగ్గేసి ఎల్లిపోయినాడే గంగ‌రాజు.....ఇది ఓ తెలుగు సినిమాలో పాపుల‌ర్ పాట‌. ప్ర‌స్తుతం ఈ పాట ఏపీలోని టీడీపీ మంత్రుల‌కు అచ్చుగుద్దిన‌ట్లు స‌రిపోతుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా కేంద్రంపై ఒత్తిడిని తెచ్చేందుకు తమ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తాం.....కేంద్రం మెడ‌లు వంచుతాం.....అది చేస్తాం...ఇది చేస్తాం....అంటూ టీడీపీ ఎంపీలు ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. రాజీనామాల సంగతి ప‌క్క‌న‌బెడితే....క‌నీసం మోదీ, బీజేపీ అధిష్టానంపై టీడీపీ ఎంపీలు తీవ్ర ఒత్తిడి తెచ్చిన దాఖ‌లాలు లేవు. ప‌గ‌టి వేష‌గాళ్ల‌లాగా కొంద‌రు టీడీపీ ఎంపీలు....మీడియాను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయ‌డం...వారికి తోడుగా కుదిరిన‌పుడు మ‌రి కొంత‌మంది ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకొని షో చేయ‌డం.....సినీ ఫ‌క్కీలో దొంగ దీక్ష‌లు చేయ‌డం మిన‌హా ఒర‌గ‌బెట్టిందేమీ లేదు. ఇక టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేప‌ట్టిన అధ‌ర్మ దీక్ష‌లు....వాటి కోసం కోట్ల రూపాయ‌ల దుబారా ఖ‌ర్చు గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఉమ్మ‌డి ఏపీ నుంచి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వ‌చ్చిన త‌మ‌కు ప్ర‌త్యేక హోదాతో న్యాయం చేస్తార‌ని గెలిపించిన టీడీపీ ఎంపీల తీరుపై ప్ర‌జ‌లు విసిగి వేసారిపోయారు. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన ఎంపీలు....త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం - స్వ‌లాభం కోసం హోదాను తాక‌ట్టుపెట్ట‌డంపై మండిప‌డుతున్నారు.

ఇటువంటి నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌లు త‌మను ఎన్నుకున్న ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచేందుకు న‌డుం బిగించారు. ముందు నుంచి ఏపీకి ప్ర‌త్యేక హోదాపై పోరాడుతోన్న త‌మ అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌ను శిర‌సావ‌హించారు. కేంద్రం మెడలు వంచి ఏపీకి హోదా తెచ్చేందుకు దేనికైనా సిద్ధ‌మ‌ని తెగించారు. మ‌రో ఏడాది వ్య‌వ‌ధి ఉండ‌గానే త‌మ ప‌ద‌వులకు స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి నిబ‌ద్ధ‌త‌ను చాటుకున్నారు. త‌మ ఏదో ఉత్తుత్తి రాజీనామాల లాగా.....టీడీపీ నేత‌ల త‌ర‌హాలో ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం కాకుండా రాజీనామాల ఆమోదించాల‌ని లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హ‌జ‌న్ పై ఒత్తిడి తెచ్చారు. రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నిక‌ల‌కు పోవాల్సి వ‌స్తుంద‌ని తెలిసిన‌ అధికార పార్టీ ఎంపీలు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో.....దేనికైనా రెడీ అంటూ....స్పీక‌ర్ పై ప‌దే ప‌దే ఒత్తిడి తెచ్చి మ‌రీ రాజీనామాల‌ను ఆమోదింప‌జేసేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు. వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి.. మేకపాటి రాజమోహన్ రెడ్డి.. వరప్రసాద్.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. వైఎస్ అవినాష్ రెడ్డిల ప‌ట్టుద‌ల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయిన స్పీక‌ర్ ....వారి రాజీనామాల‌ను  ఆమోదించనున్నట్లుగా వెల్లడించారు. పార్ల‌మెంట్ అధికారిక బులెటిన్ లో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించిన‌ట్లు ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డ‌మే త‌రువాయి.

అధికారంలో ఉన్న టీడీపీ స‌ర్కార్...హోదా విష‌యంలో ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన సంగ‌తి తెలిసిందే. హోదా అంటే జైలుకు అన్న చంద్ర‌బాబు....నేడు యూట‌ర్న్ తీసుకొని జ‌గ‌న్ బాట‌లో న‌డ‌వ‌డంతో టీడీపీ పై, చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పూర్తిగా పోయింది. అయితే, ప్ర‌తిప‌క్ష పార్టీపై ప్ర‌జ‌లు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌మ్ము చేయ‌లేదు. ఒకే మాట ....ఒకే బాణం అన్న త‌ర‌హాలో మొద‌టి నుంచి హోదాపై ఒకే మాటపై ఉన్న జ‌గ‌న్ త‌న చిత్తశుద్ధిని మ‌రోసారి నిరూపించారు. మాట త‌ప్ప‌ని మ‌డమ తిప్ప‌ని దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ....ప్ర‌జాభీష్టం ప్ర‌కారం జ‌గ‌న్ న‌డుచుకున్నారు. త‌న పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించ‌డం, వాటిని ఆమోదింప‌జేయించ‌డం ద్వారా న‌వ్యాంధ్ర ప్రజ‌లు కోల్పోయిన  `ఆ` న‌మ్మ‌కాన్ని జ‌గ‌న్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఒక పార్టీ టికెట్ పై గెలుపొంది....ఆ త‌ర్వాత స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం వేరే పార్టీలో చేరి....మంత్రి ప‌ద‌వులు అనుభ‌విస్తోన్న ఎమ్మెల్యేలు - ఎంపీలు చాలామంది ఉన్నారు. ఇటువంటి రాజ‌కీయ నేత‌లున్న కాలంలో వైసీపీ ఎంపీలు తమ‌ ప‌దవుల‌ను తృణ ప్రాయంగా వ‌దిలేయ‌డం నిజంగా అభినంద‌నీయం. మ‌రో 14 నెల‌ల ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామాలు చేయ‌డం - ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌ప‌డ‌డం ...వారి చిత్తశుద్ధికి నిద‌ర్శ‌నం. ఇప్ప‌టికీ ఇంకా ప్ర‌జ‌ల కోసం - రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడే పార్టీలు - నేత‌లు ఉన్నార‌ని వైసీపీ ఎంపీలు నిరూపించారు. వైసీపీ ఎంపీల చిత్త శుద్ధి - జ‌గ‌న్ కు వ‌స్తోన్న ప్ర‌జాద‌ర‌ణ చూసి టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. స్పీక‌ర్ ఒక వేళ ఉప ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ఆదేశిస్తే....వైసీపీ ఎంపీలపై అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టే ప‌రిస్థితి కూడా టీడీపీకి లేదు. త‌మ ప‌దవుల‌ను తృణ ప్రాయంగా వ‌దిలేసిన వైసీపీ ఎంపీలు దేశంలోని ఎంద‌రో రాజ‌కీయనాయ‌కుల‌కు ఆద‌ర్శ‌ప్రాయం అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.
Tags:    

Similar News