ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక బరిలో నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. పాలేరు ఉప ఎన్నికలో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్కతో పాటు పలువురు నాయకులు వైకాపా అధినేత జగన్ కలిశారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తనకు జగన్ చెప్పినట్లు మీడియాతో భట్టీ వివరించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయిన అనంతరం వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. గత సంప్రదాయాలను పాటిస్తూ ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నా తాము కాంగ్రెస్ ప్రతిపాదించే ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తామని వైసీపీ వివరించింది. వైఎస్ జగన్ నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బలంతో సంబంధం లేకుండా అభ్యర్థిని నిలిపే అవకాశం ఉన్నప్పటికీ జగన్ ఆ విధంగా చేయకపోవడం హర్షనీయమని వ్యాఖ్యానించారు.