వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న శాంతియుత యుద్ధానికి జనమంతా మద్దతుగా నిలుస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల పూర్తి సందర్భంగా ఆయా దేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్ ఆర్ సీపీ ఎన్నారై విభాగం తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం సైతం గళం విప్పింది. వైఎస్సార్ సీపీ ఎన్ ఆర్ ఐ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకి మద్దతుగా అమెరికాలోని వివిధ నగరాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. వాషింగ్టన్ డీసీ వర్జీనియాలోని ఫ్రైయింగ్ పాన్ ఫార్మ్ పార్కులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఫ్లకార్డులతో మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్టాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే..హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందన్నారు. ఈ మోసంలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర కీలకమని ఆరోపించారు.
రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పేరుతో సాగుతున్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయని, చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు - మోసాలు - కేసులనుండి తప్పించుకోవటానికే కేంద్రంతో కుమ్మక్కయి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ హోదాని తాకట్టు పెట్టారని ఎన్ ఆర్ ఐలు నిప్పులు చెరిగారు.తన స్వార్థ రాజకీయాల కోసం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చేసిన పనికి నవ్యాంధ్రప్రదేశ్ నష్టపోతోందని ఆరోపించారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడూ ప్రజలకి ఒక్క మంచి పని కూడా చేయలేదని - ఆనాడు పిల్లనిచ్చిన మామకే వెన్నుపొడిచి ముఖ్యమంత్రి అయ్యాడని ఈరోజు కేసులనుండి తప్పించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నాడన్నారు. ప్రజల సమస్యలు ఎరిగిన నాయకుడిగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.
ఈ నిరసన దీక్షలో వైసీపీ నేత రమేష్ రెడ్డి వల్లూరుతో పాటుగా శశాంక్ అరమడక - అమర్నాథ్ కటికరెడ్డి - మదన్ గల్లా - ఇంతియాజ్ పఠాన్ - శ్రీనివాసరెడ్డి గొప్పన్నగిరి - కిషోర్ జొన్నలగడ్డ - అర్జున్ కామిశెట్టి - శివ వంకిరెడ్డి - వెంకటమణిదీప్ కొత్తా - చంద్రతేజా రెడ్డి - శ్రీధర్ నాగిరెడ్డి - నినాద్ అన్నవరం - సతీష్ నరాల - వెంకట రాజా రెడ్డి - శ్రీనివాస రెడ్డి - వెంకటరమణారెడ్డిలతో పాటుగా పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.