బాబు సొంత ఇంట తొడగొడుతున్న వైసీపీ

Update: 2020-02-02 05:03 GMT
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.. ఇప్పుడు అధికార వైసీపీ అదే దూకుడుతో వెళ్తోంది. 40 ఇయర్స్ పాలిటిక్స్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన స్వగ్రామంలోనే దెబ్బకొట్టడానికి ఢీ అంటే ఢీ అంటోంది. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు - టీడీపీని గట్టి దెబ్బకొట్టడానికి వైసీపీ ప్లాన్ చేసింది. ఏకంగా చంద్రబాబు స్వగ్రామమైన చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.

చంద్రబాబు ఇంట ఆయన్నుదారుణంగా దెబ్బతీయడానికి వైసీపీ పెద్ద స్కెచ్ వేసింది. ఈ నేపథ్యంలోనే ఏకంగా 20వేల మందితో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఆదివారం నిర్వహిస్తోంది.

ఈ సభకు వైసీపీ మంత్రులు - సలహాదారులు సహా కీలక నేతలు హాజరుకానున్నారు. ఏపీ 3 రాజధానులకు చంద్రబాబు సొంత ఇలాకా ప్రజలే మద్దతుగా ఉన్నారని నిరూపించే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తోంది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

చంద్రబాబు ఇంట వైసీపీ సభపై టీడీపీ భగ్గుమంది. తిరుపతిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News