వంచ‌నపై గ‌ర్జ‌న దీక్షలో వ‌క్త‌ల మాట‌లు వినాల్సిందే

Update: 2018-12-27 10:54 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ మొద‌ట్నించి ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా దేశ రాజ‌ధానిలో వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష షురూ అయ్యింది. ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ కు చెందిన ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం తాను త‌ప్పించి మ‌రెవ‌రూ మాట్లాడ‌ర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. జ‌గ‌న్ పార్టీ నేత‌ల మాట‌లు వినాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించేందుకు ఢిల్లీని వేదిక‌గా తీసుకొని చేప‌ట్టిన తాజా దీక్ష‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప‌లువురు మాట్లాడారు. ఎవ‌రేం మాట్లాడ‌ర‌న్న‌ది వారి మాట‌ల్లోనే చూస్తే..

జంగా కృష్ణ‌మూర్తి

+ ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకోవ‌టంతో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింది
+ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని యావ‌త్ తెలుగు జాతి మొత్తం కోరుకుంటోంది
+ హోదా సాధ‌న‌లో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు
+ ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న జ‌గ‌న్ తోనే సాధ్యం.

మ‌ల్లాది విష్ణు

+ ఏపీకి ప్ర‌త్యేక హోదాపై హామీ ఇచ్చిన చంద్ర‌బాబు.. ప‌వ‌న్ క‌ల్యాణ్.. బీజేపీ నేత‌లు ఏపీ ప్ర‌జ‌ల్ని న‌డిరోడ్డున ప‌డేశారు
+ ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని చెప్పి.. ఎవ‌రి దారిన వారు పోయిన ఘ‌న‌త కూట‌మిదే
+ హోదాపై చంద్ర‌బాబు ఎప్పుడో చేతులెత్తేశారు. ఇప్పుడు కొత్త నాట‌కం ఆడుతున్నారు
+ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మోడీ స‌ర్కారుపై అవిశ్వాసం పెట్టిన మొద‌టి పార్టీ మాదే
+ హోదా సాధ‌న‌లో భాగంగా ఎంపీల చేత రాజీనామాలు చేయించింది జ‌గ‌నే
+ టీడీపీ నేత‌ల‌కు దమ్ముందా?  ఉంటే.. ప్ర‌ధాని మోడీ ఇంటి ద‌గ్గ‌ర క‌లిసి ధ‌ర్నా చేద్దాం

శ్రీ‌కాంత్ రెడ్డి

+ దివంగ‌త మ‌హానేత హ‌యాంలోనే పోల‌వ‌రం ప‌నులు ప్రారంభించారు.
+ ఆయ‌న చ‌లువ‌తోనే పోల‌వ‌రానికి రూపం వ‌చ్చింది.
+ క‌మిష‌న్ల క‌క్కుర్తి కోస‌మే బాబు పోల‌వ‌రం ప్రాజెక్టును క‌డుతున్నారు
+ బాబు త‌న రాజ‌కీయ స్వార్థం కోసం ఏ పార్టీతోనైనా క‌లుస్తారు
+ ప్ర‌త్యేక హోదాపై బాబుకు చిత్త‌శుద్ది లేదు
+ ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌న్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు శంకుస్థాప‌న చేస్తున్నారు
+ అల్మ‌ట్టి డ్యామ్ ఎత్తు పెర‌గ‌టానికి బాబే కార‌ణం


Tags:    

Similar News