2016 ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోయింది. వారాల తరబడి సుదీర్ఘంగా సాగిన ఐపీఎల్ 2016 సీజన్ ముగిసింది. విజేతగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఘనవిజయం సాధించింది. అయితే.. హైదరాబాద్ జట్టు ఐపీఎల్ విజేతగా అవతరించిన నేపథ్యంలో.. ఆ జట్టు సభ్యుడు యువరాజ్ సింగ్ అరుదైన ఒక ప్రపంచ రికార్డు సాధించారు. ఐదు ప్రపంచ కప్ టోర్నీల్లో విజేతగా నిలిచిన జట్టులో ఉన్న ఏకైక ఆటగాడిగా యువరాజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
వన్డే వరల్డ్ కప్.. టీ20 వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. అండర్ వరల్డ్ కప్.. ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకున్న జట్లలో యువరాజ్ సభ్యుడిగా ఉండటం విశేషంగా చెప్పాలి. తాజా ఐపీఎల్ విజయంలో మాంచి ఖుషీగా ఉన్న యువరాజ్.. తను సాధించిన అరుదైన రికార్డు గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనకెంతో సంతోషంగా ఉందని రియాక్ట్ అయ్యారు. అరుదైన ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నప్పుడు ఆ మాత్రం ఆనందం ఉండదా ఏంటి?