వివాదాస్పద మత ప్రభోదకుడు జకీర్ నాయక్ తన తండ్రి అంత్యక్రియలకూ రాలేదు. జకీర్ తండ్రి - ఒకప్పుడు బాంబే సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కరీమ్ నాయక్ (88) ఆదివారం ఉదయం మరణించారు. కొన్ని రోజులుగా లో బీపీ - అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న జకీర్ తండ్రి అబ్దుల్ కరీమ్ కు గుండెపోటు రావడంతో ఆయనను ఇటీవలే మజ్ గావ్ లోని ప్రిన్స్ అలీఖాన్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆదివారం ఉదయం 3.30 ప్రాంతంలో ఆయన చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు లాయర్లు - డాక్టర్లు - జర్నలిస్టులు - వ్యాపారవేత్తలంతా కలిసి సుమారు 1500 మంది హాజరయ్యారు. తండ్రి అంత్యక్రియలకు హాజరు కావాల్సిఉన్నప్పటికీ అరెస్ట్ చేస్తారన్న భయంతో జకీర్ మలేషియాలోనే ఉండిపోయాడు. కొత్తగా ఎఫ్ఐఆర్ ఏదీ నమోదు కాకపోయినప్పటికీ . అరెస్ట్ భయంతో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు.
జకీర్ రెచ్చగొట్టే ప్రసంగాలు - అతనిపై ఉన్న క్రిమినల్ కేసులు - మత ప్రచారం చేస్తున్న పీస్ టీవీతో అతని సంబంధాలను కారణాలుగా చూపుతూ.. ఆ సంస్థపై నిషేధం కేంద్రం నిషేధం విధించింది. జకీర్ కు చెందిన ఎన్జీవో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను కేంద్ర చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించడానికి సిద్ధమవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో జకీర్ తండ్రి అంత్యక్రియల వద్ద ముంబై సిటీ క్రైమ్ బ్రాంచ్ - నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ - స్థానిక పోలీసులు శ్మశానం దగ్గర కనిపించారు. అయితే రొటీన్ సమాచారం మేరకు తాము ఇక్కడికి వచ్చినట్లు వాళ్లు తెలిపారు. కొన్ని రోజులుగా లోబీపీ - అవయవాల వైఫల్యంతో కరీమ్ బాధపడుతున్నారని ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజర్ మంజూర్ షేక్ చెప్పారు. జకీర్ ఎందుకు రాలేదని ప్రశ్నించగా.. హఠాత్తుగా ఈ ఘటన జరగడం వల్ల రాలేకపోయారని వెల్లడించారు. జులై 1న బంగ్లాదేశ్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రేరేపితమైనవాళ్లన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి ఇండియా నుంచి పారిపోయిన జకీర్.. మలేషియాలో ఉంటున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/