కేంద్ర మంత్రి ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర మంత్రి బుగ్గ‌న‌న‌కు అవ‌మానం..

Update: 2021-06-13 14:30 GMT
కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదివారంఏపీలో ప‌ర్య‌టించారు. తొలుత తిరుమ‌ల‌, త‌ర్వాత తిరుచానూరుల్లో ఆయ‌న ప‌ర్య‌టించి.. స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి అవ‌మానం జ‌రిగింది. న్యూఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్ర‌యం చేసుకున్నారు పీయూష్ గోయ‌ల్‌. అనంత‌రం నేరుగా తిరుమ‌ల వెళ్లి స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. తిరుచానూరులో ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.

తిరుచానూరులో తొలుత మంత్రి గోయ‌ల్‌కు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. అయితే.. గోయ‌ల్ కుటుంబ స‌భ్యుల‌తో రావ‌డంతో అతిథి గృహంలో ఆయ‌న‌తో మాట్లాడేందుకు అవ‌కాశం రాలేదు. దీంతో తిరుగు ప్ర‌యాణంలో గోయ‌ల్‌ను క‌లిసి.. రాష్ట్ర స‌మస్యల‌పై ముఖ్యంగా.. రైల్వే లైన్ల‌కు సంబంధించి రిక్వ‌స్ట్ చేయాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలో గోయ‌ల్ తిరుగు ప్ర‌యాణంలో రేణిగుంట విమానాశ్ర‌యంలో ఆయ‌న‌ను క‌ల‌వాల‌ని.. బుగ్గ‌న భావించారు.

అయితే.. అక్క‌డ రేణిగుంట విమానాశ్ర‌య భ‌ద్ర‌తా వ‌ర్గాలు.. మంత్రి బుగ్గ‌న‌ను అడ్డుకున్నాయి. విమానాశ్ర యంలో వీఐపీ గేట్ లోపలకు రానీయకుండా కేంద్ర భద్రత సిబ్బంది అడ్డుకున్నాయి. దీంతో మంత్రి బుగ్గన.. పీయూష్ గోయల్‌కు వీడ్కోలు పలకలేక పోయారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బందితో మంత్రి వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్నవారి వివరాలు ఇవ్వాలని బుగ్గన అడిగారు. అయితే విమానాశ్రయ అధికారులు మంత్రిని సర్దుబాటు చేసి పంపించారు. దీంతో కేంద్ర మంత్రి గోయ‌ల్‌ను క‌ల‌వ‌క‌పోగా.. బుగ్గ‌న‌కు అవ‌మానం ఎదురైంది.




Tags:    

Similar News