అమెరికాలో మరో దారుణం చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అధిపతిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న హత్యల పరంపరలో మరో ఘాతుకం జరిగింది. అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. సాయుధులైన దుండగుల చేతిలో భారతీయుడు హత్య చేయబడ్డాడు.
పంజాబ్ కు చెందిన 26 ఏళ్ల వ్యక్తి అయిన విక్రమ్ జర్యల్ వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏఎం-పీఎం గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. ఆయన్ను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. పోలీసుల కథనం ప్రకారం తుపాకులు ధరించిన దుండగులు విక్రమ్ వద్ద ఉన్న డాలర్లు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అవి ముట్టజెప్పిన అనంతరం ఆయన తలపై తుపాకి పెట్టి కాల్చి చంపేశారు. ఈ హత్యను జాతి విద్వేష ఘాతుకం కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విక్రమ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నం చేస్తోంది. మృతిడి పెద్దన్న చేసిన ట్వీట్ కు కేంద్ర విదేశంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందిస్తూ ``మీ సోదరుడి ఆకస్మిక, విషాదకరమైన మరణానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ విషయంలో సరైన విధంగా స్పందించి తగు చర్యలు చేపట్టాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆదేశించాను`` అని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/