దయా ట్రైలర్: థ్రిల్లింగ్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో జేడీ అమాయ‌కుడేనా?

ఓటీటీ ప్ర‌పంచంలో సిస‌లైన పోటీకి తెర తీసిన డిస్నీ+ హాట్ స్టార్ ఒరిజిన‌ల్ కంటెంట్ తో త‌న‌దైన మ్యాజిక్ ని సృష్టిస్తోంది.

Update: 2023-07-16 15:43 GMT

ఓటీటీ ప్ర‌పంచంలో సిస‌లైన పోటీకి తెర తీసిన డిస్నీ+ హాట్ స్టార్ ఒరిజిన‌ల్ కంటెంట్ తో త‌న‌దైన మ్యాజిక్ ని సృష్టిస్తోంది. ఈ సంవత్సరం ఝాన్సీ సీజన్ 2- డెడ్ పిక్సెల్స్ - సేవ్ ది టైగర్స్ వంటి కొత్త తెలుగు షోల‌తో ఆక‌ట్టుకుంది. డిస్నీ+ హాట్ స్టార్ నుండి త‌దుప‌రి `దయా` అనే షో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది.

ఈ షో ప్ర‌మెష‌న‌ల్ మెటీరియ‌ల్ ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇందులో నటుడు జెడి చక్రవర్తి - ఈషా రెబ్బా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ ను తాజాగా చిత్ర‌బృందం ఆవిష్కరించింది. ఒక మ‌హిళా జర్నలిస్ట్ మిస్సింగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఒక సాధారణ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ దయా అనుమానాస్పద పరిస్థితుల్లో తన వాహనంలో మృతదేహాన్ని చూస్తాడు. ఆ త‌ర్వాత అత‌డు చేసిన త‌ప్పులు త‌న‌ని ఎలా ఇరికించాయ‌నేది ఉత్కంఠభరితమైన మ‌లుపు తీసుకుంటుంది. ట్రైల‌ర్ లో స‌స్పెన్స్ మిస్ట‌రీ థ్రిల్స్ ఆస‌క్తిని క‌లిగించాయి. ద‌యా (జేడీ) ఎంతో మంచివాడుగా క‌నిపిస్తున్నాడు. ద‌యా అస‌లు మంచివాడేనా? త‌న‌పై ప‌డిన నింద నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అన్న‌ది సిరీస్ చూస్తే కానీ అర్థం కాదు.

ఆగస్టు 4 నుంచి ఇది ఓటీటీలో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఇది జెడి చక్రవర్తికి తెలుగులో గ్రేట్ కంబ్యాక్ అవుతుంద‌నే భావిస్తున్నారు. ముఖ్యంగా అమాయ‌కుడిలా క‌నిపిస్తున్న జేడీ ట్రైల‌ర్ చివ‌రిలో చెప్పిన సంభాష‌ణ‌లు అత‌డి పాత్ర‌లో స‌స్పెన్స్ ని ఆవిష్క‌రించాయి. రెమ్యా నంబీషన్- పృధ్వి రాజ్- కమల్ కామరాజు- జోష్ రవి త‌దిత‌రులు ఈ సిరీస్ లో న‌టించారు. దీనికి పవన్ సాధినేని - శ్రీకాంత్ మోహతా దర్శకత్వం వహించారు. ప్రముఖ బెంగాలీ ప్రొడక్షన్ హౌస్ అయిన SVF బ్యానర్ పై మహేంద్ర సోని ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.


Full View


Tags:    

Similar News