నెక్స్ట్ సీజన్ లో రోహిత్ శర్మ చేరబోయే జట్టు ఇదేనా?

ఇందులో భాగంగా... రోహిత్ ముంబై ని వీడియనున్నాడా? అనేది వాటిలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన ప్రశ్నగా హల్ చల్ చేసింది!

Update: 2024-04-10 12:41 GMT

ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు నుంచీ ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ మార్పు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇంకా గట్టిగా చెప్పాలంటే... ఇదే టాప్ ట్రెండింగ్ ఇష్యూగా కూడా మారింది! దీంతో రోహిత్ శర్మకు సంబంధించి పలు ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... రోహిత్ ముంబై ని వీడియనున్నాడా? అనేది వాటిలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన ప్రశ్నగా హల్ చల్ చేసింది!

తనను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని రోహిత్ జీర్ణించుకోలేకపోతున్నారని.. ఆయన జీర్ణించుకుని సర్దుకుందామన్నా ఫ్యాన్స్ ఆ గ్యాప్ ఇవ్వడం లేదని రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి! ఏకంగా ఐదుసార్లు జట్టును టోర్నమెంట్ విజేతగా నిలిపిన కెప్టెన్ కు ఇంతటి అవమానమా అంటూ ఆయన ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర చర్చను లేవనెత్తడంతో... ఇది ఇప్పటికీ హార్దిక్ పాండ్యాకు మెంటల్ టెన్షన్ గానే ఉందని అంటున్నారు.

మైదానంలోకి పాండ్యా రాగానే... రోహిత్ ఫ్యాన్స్ చేస్తున్న ర్యాగింగ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి! అతడు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పే అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంటుంది. అయితే... ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు సీనియర్లు స్పందించారు. ఇది ప్రాంచైజీ క్రికేట్ అని.. ఇక్కడ ఆయా జట్టుల మేనేజ్ మెంట్స్ తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అని.. ఇది కోట్ల రూపాయలకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు!

నాటి నుంచీ పాండ్యా విషయంలో రోహిత్ ఫ్యాన్స్ దాడి కాస్త తగ్గుముఖం పట్టిందని అంటున్నారు! పైగా.. వరుస ఓటముల తర్వాత ఒక మ్యాచ్ గెలవడంతో.. అది పాండ్యాతో పాటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు కూడా భారీ ఉపశమనమని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోహిత్ శర్మకు సంబంధించిన ఒక ప్రచారం తెర మీదకు వచ్చింది.

అవును... వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ప్లేయర్ రోహిత్ శర్మను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకోనుందనే చర్చ ప్రస్తుతం వైరల్ గా మారింది. దానికి కారణం... ఇటీవల లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ కు ఒక ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్న.. దానికి వచ్చిన సమాధానం.. ఈ సందర్భంగా జరిగిన డిస్కషన్ అని అంటున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జస్టిన్ లాంగర్ కు ఒక ప్రశ్న ఎదురైంది! ఇందులో భాగంగా... ఐపీఎల్ లో మీరు ఏ ఆటగాడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని! దీనికి సమాధానం చెప్పకుండా.. ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలా.. ఎవరి పేరు చెప్పినా పర్లేదా అంటూ కొన్ని ఎదురు ప్రశ్నలు వేశారు లాంగర్. దీనికి స్పందించిన యాంకర్... "రోహిత్ శర్మను మీరు జట్టులో చేర్చుకోగలరా"? అని ప్రశ్నించారు.

దీంతో షాక్ తిన్నంత ఎక్స్ ప్రెషన్ పెట్టిన లాంగర్... రోహిత్ శర్మనా? అలా అయితే అతడిని ముంబై నుంచి ట్రేడ్ చేసుకుంటాం.. నాకు తెలిసి ఈ డీల్ మీరే కుదర్చగలరు అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. దీంతో... ఈ విషయం నెట్టింట వైరల్ గా మారి.. అటు తిరిగి ఇటు తిరిగి రోహిత్ లక్నో వైపు చూస్తున్నాడా అనే ప్రశ్నవరకూ చేరింది. మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే... ఐపీఎల్ సీజన్ 18 వరకూ ఆగాల్సిందే!

Tags:    

Similar News