టీమిండియా-2.. సీక్వెల్ కాదు.. భవిష్యత్ స్టార్లతో ఆసియా క్రీడల కు

తాజాగా ఆసియా క్రీడల కు ఇలానే టీమిండియా తమ రెండో జట్టును పంపిది. ఈ జట్టుకు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్.

Update: 2023-07-15 07:36 GMT

ఇప్పుడంతా సీక్వెల్ యుగం.. సినిమాల్లో పార్ట్ 1 పార్ట్ 2 హవా నడుస్తోంది. అయితే క్రీడల్లో ఇందుకు అవకాశం ఉంటుందా..? అంటే అది మరో రూపం లో ఉంటుంది. అదెలాగంటే.. ఒక దేశాని కి రెండు జట్లు అన్నమాట. భారత్ లాంటి పెద్ద దేశం లో ఒకటేమిటి మూడు జాతీయ జట్లను తయారుచేయొచ్చు.

ప్రతిభ పరంగా చూస్తే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ వంటి వాటికి కూడా ఇలాంటి చాన్సు ఉండొచ్చు. తాజాగా ఆసియా క్రీడల కు ఇలానే టీమిండియా తమ రెండో జట్టును పంపిది. ఈ జట్టుకు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే ఆసియా క్రీడల కు మొత్తం 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.

రింకూ వచ్చేశాడు..

ఇటీవలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ రింకూ సింగ్ తొలిసారి భారత జట్టులో చోటు సంపాదించాడు. యశస్వి జైస్వాల్ రాహుల్ త్రిపాఠి తిలక్ వర్మ జితేశ్ శర్మ వాషింగ్టన్ సుందర్ షాబాజ్ అహ్మద్ రవి బిష్ణోయ్ అవేష్ ఖాన్ అర్షదీప్ సింగ్ ముకేశ్ కుమార్ శివమ్ మావి శివమ్ దూబె ప్రభ్ సిమ్రన్ సింగ్ మిగతా సభ్యులు. వీరిలో యశస్వి తిలక్ ప్రస్తుతం వెస్టిండీస్ టూర్ కు ఎంపికైనవారే. వికెట్ కీపర్లు జితేశ్ శర్మ పభ్ సిమ్రన్ సేవలందిస్తారు. యశ్ ఠాకూర్ సాయికిశోర్ వెంకటేశ్ అయ్యర్ దీపక్ హూడా సాయిసుదర్శన్ స్టాండ్ బై ఆటగాళ్లు.

షా ఎక్కడ..?

టీమిండియా లో చోటు తో పాటు ఫామ్ కూడా కోల్పోయిన ముంబై బ్యాట్స్ మన్ ప్రథ్వీ షా ప్రస్తుతం దులీప్ ట్రోఫీ లో ఆడుతున్నాడు. అతడికి ఆసియా క్రీడల జట్టులోనూ చోటివ్వలేదు. అయితే షా ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రతిభావంతుడైనప్పటికీ అందుకే అతడికి చోటు దక్కలేదు. ఆసియా క్రీడల్లో బరిలో దిగే మహిళల జట్టు లో తెలుగమ్మాయిలు అంజలి శర్వాణి బారెడ్డి అనూష చోటు దక్కించుకున్నారు. హర్మన్ ప్రీత్ సింగ్ కెప్టెన్ గా వ్యవహరించనుంది.

Tags:    

Similar News