పెద్ద కప్పు తెచ్చినా కెప్టెన్ కు చోటు లేదు..రోహిత్ శర్మ కు బిగ్ షాక్

మరీ ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఎవరూ అంత తొందరగా మర్చిపోలేరు.;

Update: 2025-03-11 09:30 GMT

సాధారణంగా ఏదైనా పెద్ద టోర్నీల్లో జట్టు టైటిల్ కొట్టిందంటే అందరూ ముందుగా చూసేది కెప్టెన్ ఎవరు? అని..? తన జట్టును విజయపథంలో నిలిపిన సారథిని అందరూ అబ్బో అని పొగిడేస్తుంటారు... తాజాగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవడంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర అందరికీ తెలిసిందే.

మరీ ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఎవరూ అంత తొందరగా మర్చిపోలేరు. ఇక టోర్నీ మొత్తం కూడా రోహిత్ కెప్టెన్సీ ఆకట్టుకుంది. సహచరులను సున్నితంగా మందలిస్తూనే మార్గదర్శకత్వం చేసే రోహిత్ స్టయిల్ భవిష్యత్ లో కెప్టెన్ కావాలనుకునేవారికి గొప్ప పాఠం.

పెద్ద టోర్నీమెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లతో జట్టను ప్రకటిస్తుంది. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీ అనంతరం కూడా ఇదే పనిచేసింది. కానీ, ఇందులో కప్ నెగ్గిన జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు చోటు లేకపోవడం గమనార్హం.

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264)తో పాటు మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైన బ్యాట్స్ మన్, 11 వేల పరుగులు చేసిన గొప్ప క్రికెటర్, జట్టును ప్రపంచ కప్ ఫైనల్ చేర్చిన మేటి కెప్టెన్, తాజాగా చాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టిన సారథి అయిన రోహిత్ శర్మకు ఐసీసీ తాజాగా ప్రకటించిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్ లో చోటు లేకపోవడం ఆశ్చర్యకరమే కదా?

ఓడిన కెప్టెన్ కు చోటు

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా.. స్పిన్ ఆల్ రౌండర్ శాంట్నర్ సారథ్యంలోని న్యూజిలాండ్ పై గెలిచిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రకటించిన తాజా చాంపియన్స్ ట్రోఫీ టీమ్ లో విన్నింగ్ కెప్టెన్ రోహిత్ కు మాత్రం చోటివ్వలేదు.

గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)తో పాటు భారత్ నుంచి కోహ్లి, వరుణ్ చక్రవర్తి, షమీ, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లను ఎంపిక చేసింది. అఫ్ఘానిస్థాన్ కు చెందిన ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లాలకూ చోటిచ్చింది. రోహిత్ ను మాత్రం పట్టించుకోలేదు.

Tags:    

Similar News