"పంత్" పట్టిన ఢిల్లీ.. ఈ సీజన్ లో "సూపర్" బోణీ!
దీంతో... డేవిడ్ వార్నర్, పృథ్వీ షా లు బ్యాట్ లు చేతపట్టి మైదానంలోకి అడుగుపెట్టారు.
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... చెన్నై సూపర్ కింగ్స్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో... డేవిడ్ వార్నర్, పృథ్వీ షా లు బ్యాట్ లు చేతపట్టి మైదానంలోకి అడుగుపెట్టారు. అనంతరం మ్యాచ్ ఆంధ్యంత ఎలా సాగిందనేది ఇప్పుడు చూద్దాం!
స్లోగా స్టార్ట్ చేసిన ఢిల్లీ!:
ఢిల్లీ - చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కి దిగిన డేర్ డెవిల్స్ బ్యాటర్స్ కాస్త స్లోగానే స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా... తొలి ఓవర్ లో 7, రెండో ఓవర్ లో 3, మూడో ఓవర్ లో 9, నాలుగో ఓవర్ లో 5 పరుగులు వచ్చాయి. దీంతో... నాలుగు ఓవర్లకు ఢిల్లీ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.
ఐదో ఓవర్ లో దడదడలాడించిన వార్నర్:
దీపర్ చాహర్ వేసిన ఐదో ఓవర్ లో డేవిడ్ వార్నర్ జూలు విదిల్చాడు. అప్పటివరకూ తన సహజ శైలికి కాస్త భిన్నంగా ఆడుతున్నట్లు కనిపించిన వార్నర్... ఆ ఓవర్లో వరుసగా ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. దీంతో... ఐద్ ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 42 పరులకు చేరుకుంది. ఈ సమయంలో... ఢిల్లీ ఫ్యాన్స్ లో సందడి మొదలైంది.
పృథ్వీ షా హ్యాట్రిక్ ఫోర్లు:
ముస్తాఫిజూర్ రహ్మాన్ వేసిన ఆరో ఓవర్ లో వార్నర్ ఒక ఫోర్ కొట్టి సింగిల్ తీసి ఇస్తే... పృథ్వీ ష వరుసగా 3 ఫోర్లు బాదాడు. దీంతో మరోసారి మైదానం హోరెత్తింది. ఫలితంగా పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 62గా ఉంది.
డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ:
జడేజా వేసిన తొమ్మిదో ఓవర్ లో ఫస్ట్ బాల్ కి సిక్స్ బాదిన వార్నర్.. తర్వాత రెండు సింగిల్స్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో.. 32 బంతుల్లోనే వార్నర్ హాఫ్ సెంచరీ చేసినట్లయ్యింది. ఫలితంగా ఢిల్లీ స్కోరు 9 ఓవర్లకు వికెట్లేమీ నష్టపోకుండా 91 పరుగులకు చేరింది.
వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్... వార్నర్ గాన్!:
అద్భుతంగా బ్యాటింగ్ చేసుకున్న డెవిడ్ వార్నర్.. ఒక అద్భుతమైన క్యాచ్ కి అవుటయ్యాడు. ముస్తాఫిజూర్ వేసిన 10వ ఓవర్లో మూడో బంతికి రివర్స్ స్కూప్ షాట్ ఆడగా.. గల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు పతిరన. అప్పటికి వార్నర్ వ్యక్తిగత స్కోరు 52 (35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు). దీంతో పది ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు ఒక వికెట్ నష్టానికి 95 పరుగులకు చేరింది.
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ!
జడేజా వేసిన 11 ఓవర్ మూడో బంతికి సిక్స్ బాదిన పృథ్వీ షా.. నాలుగో బంతికి వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి షా వ్యక్తిగత స్కోరు 43 (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు కాగా.. 11 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు.
ఢిల్లీకి పెద్ద దెబ్బ... ఒకే ఓవర్ లో రెండు వికెట్లు!:
మతిశా పతిరన ఢిల్లీని గట్టి దెబ్బ తీశాడు. ఇందులో భాగంగా.. అతడు వేసిన 15 ఓవర్లో నాలుగో బంతికి మిచెల్ మార్ష్ (18), ఆఖరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్ (0) లను ఔట్ చేశాడు. ఇద్దరినీ యార్కర్లతో బోల్తా కొట్టించడం గమనార్హం. దీంతో... 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 134 పరుగులకు చేరుకుంది.
రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ.. ఔట్!:
ఢిల్లీ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఇన్నింగ్స్ ఆవిష్కృతమైంది. కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్ ఎత్తాడు. పతిరన వేసిన 19 ఓవర్ లో వరుసగా 6,4,4 బాదిన పంత్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం... నెక్స్ట్ బంతికే ఔటయ్యాడు. అప్పటికి పంత్ వ్యక్తిగత 51 (32 బంటుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు) పరుగులు.
భారీ స్కోరు చేసిన ఢిల్లీ!:
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ భారీ స్కోరే చేసింది. ఇందులో భాగంగా నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. పృథ్వీ షా (45), డేవిడ్ వార్నర్ (52), రిషభ్ పంత్ (51) దుమ్ము దులిపేశారు!
మరోపక్క చెన్నై బౌలర్లలో మతిశా పతిరన 3.. ముస్తాఫిజుర్ రెహ్మన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
తొలి ఓవర్ లోనే చెన్నైకి షాక్!:
ఢిల్లీ నిర్ధేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన చెన్నైకి ఫస్ట్ ఓవర్ లాస్ట్ బంతికి షాక్ తగిలింది. ఇందులో భాగంగా... ఖలీల్ అహ్మద్ చేతిలో రుతురాజ్ గైక్వాడ్ (1) కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఒక ఓవర్ ముగిసే సరికి చెన్నై స్కోరు ఒక వికెట్ నష్టానికి 3 పరుగులకు చేరుకుంది.
మూడో ఓవర్ లో రెండో వికెట్ డౌన్!:
మరోసారి ఖలీల్ అహ్మద్ చెన్నైకి షాక్ ఇచ్చాడు. ఇందులో భాగంగా... అతడు వేసిన మూడో ఓవర్ లో... సూపర్ ఫాం లో ఉన్న రచిన్ రవీంద్ర (2) ను ఔట్ చేశాడు. దీంతో... మూడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు.
పవర్ ప్లే పూర్తయ్యేనాటికి చెన్నై పరిస్థితి ఇది!:
వరుసగా రెండు దెబ్బలు తగలడంతో కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్న చెన్నై బ్యాటర్లలో మిచెల్ (11), రహానే (20) ను ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నారు. ఈ సమయంలో... 6 ఓవర్లకు చెన్నై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులుగా ఉంది.
చెన్నై మూడో వికెట్ డౌన్!:
10 ఓవర్లకు 75 పరుగులతో ఉన్న చెన్నైకి 11 ఓవర్లో మరో షాక్ తగిలింది. ఇందులో భాగంగా... అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్ లో డారిల్ మిచెల్ (34) ఔటయ్యాడు. దీంతో 11 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై స్కోరు 3 వికెట్ల నష్టానికి 78 పరుగులుగా ఉంది.
100 దాటిన చెన్నై స్కోరు... రహానే ఔట్:
13 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై స్కోరు 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు కాగా... ఆ తర్వాతి ఓవర్లో అజింక్య రహానె 45 (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు) ఔటయ్యాడు. ఇదే క్రమంలో 14 ఓవర్ లో సమీర్ రిజ్వి (0) గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. దీంతో 15 ఓవర్లకు చెన్నై స్కోరు 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు సాధించింది. ఈ పరిస్థితుల్లో చెన్నై విజయానికి ఆఖరి ఐదు ఓవర్లలో 79 పరుగులు కావాలి.
శివమ్ దూబె (18) ఔట్!:
అంతకంతకూ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్న సమయంలో... ముకేశ్ కుమార్ వేసిన 17 ఓవర్ లో దూబే ఔటయ్యాడు. దీతో.. ధోనీ క్రీజ్ లోకి వచ్చాడు. వచ్చీ రాగానే రెండు ఫోర్లు బాదాడు. దీంతో... 17 ఓవర్లకు చెన్నై స్కోరు 6 వికెట్ల నష్టానికి 134 పరుగులకు చేరుకుది.
చెన్నై ఓటమి ఖాయం!:
18 ఓవర్ లో 12 పరుగులు రాగా.. 19 ఓవర్లకు చెన్నై స్కోరు 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు. దీంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే చెన్నై ఓటమి కన్ ఫాం అయ్యింది.
చెన్నైకి షాకిచ్చిన ఢిల్లీ!:
ఢిల్లీ నిర్ధేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ తడబడింది. దీంతో... 20 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై 171 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా... 20 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ ఈ సీజన్ లో సూపర్ బోణీ కొట్టింది. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ 3, ఖలీల్ అహ్మద్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు.