ఐపీఎల్ లో ఎంఐ నుంచి రోహిత్ శర్మ ఎర్నింగ్స్ ఎంతో తెలుసా?
ప్రతీ ఏటా ఈ ఐపీఎల్ చేసే సందడి అంతా ఇంతా కాదు.
భారతదేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగానూ, కొత్తగానూ చెప్పుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి! ఇక్కడ క్రికెట్ ను ఒక క్రీడగా మాత్రమే చూసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.. మెజారిటీ ప్రజలు దీన్ని ఓ మతంగా, ఓ ఎమోషన్ గా, ఓ సెంటిమెంట్ గా చూస్తారని అంటారు.
అలాంటి క్రికెట్ కి సరికొత్త హంగులు అద్దుతూ.. దాన్ని మరింత పీక్స్ కి తీసుకెళ్లింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ప్రతీ ఏటా ఈ ఐపీఎల్ చేసే సందడి అంతా ఇంతా కాదు. టీమిండియా ఆటగాళ్లంతా ఆయా జట్టుల్లోకి వెళ్లిపోయి.. ఎవరి ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ వాళ్లు ఇస్తుంటారు. అభిమానులను అలరిస్తుంటారు.
ఈ సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీక్స్ ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిందెవరనే విషయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ ద్వారా రూ.194.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు రోహిత్.
ఇక రోహిత్ తర్వాత ఈ జాబితాలో రెండో స్థానంలో రూ.188.84 కోట్లతో మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ఆ తర్వాత వరుసగా... విరాట్ కొహ్లీ (రూ.188.2 కోట్లు).. రవీంద్ర జడేజా (రూ.125.01 కోట్లు).. సునీల్ నరైన్ (రూ.113.25 కోట్లు) ఉన్నారు. ఈ టాప్ స్టార్స్ అంతా ఐపీఎల్ లో అత్యధికంగా సంపాదించిన జాబితాలో టాప్ లో ఉన్నారు.
ఇక ఈ జాబితాలో వీరి తర్వాత... సురేష్ రైనా, గౌతం గంభీర్, శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్ వెల్, యువరాజ్ సింగ్ తదితరులు ఉన్నారు.
ఎంఐతో రోహిత్ ప్రయాణం..:
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2011లో ముంబై ఇండియన్స్ లో చేరాడు. ఈ ప్రాంఛైజీ కోసం ఇప్పటివరకూ 14 సీజన్లు ఆడాడు. ఈ సమయంలో... 158 మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ.. 87 మ్యాచ్ లలో గెలిచి, 67 మ్యాచ్ లలో ఓటమిని ఎదుర్కోన్నాడు.
ఈ క్రమంలో 2011 నుంచి 2024 వరకూ ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ ఎర్నింగ్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దామ్..!
2011 - రూ.9.20 కోట్లు
2012 - రూ.9.20 కోట్లు
2013 - రూ.9.20 కోట్లు
2014 - రూ.12.50 కోట్లు
2015 - రూ.12.50 కోట్లు
2016 - రూ.12.50 కోట్లు
2017 - రూ.12.50 కోట్లు
2018 - రూ.15 కోట్లు
2019 - రూ.15 కోట్లు
2020 - రూ.15 కోట్లు
2021 - రూ.15 కోట్లు
2022 - రూ.16 కోట్లు
2023 - రూ.16 కోట్లు
2024 - రూ.16 కోట్లు