ధోనీ 110 మీటర్ల సిక్స్ చూశారా?.. డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శనివారం అత్యంత రసవత్తరమైన మ్యాచ్ జరిగింది
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శనివారం అత్యంత రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది బెంగళూరు. వరుసగా ఆరు మ్యాచ్ లలో గెలిచి, ప్రత్యర్థులతో పాటు అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విక్టరీతో పాటు మరో హైలెట్ గా నిలిచింది ధోనీ కొట్టిన భారీ సిక్స్!
అవును... తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నె సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక భారీ సిక్సర్ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. యశ్ దయాల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతిని ధోనీ తనదైన స్టాండ్స్ లోకి పంపించారు. ధోనీ దెబ్బకు ఆ బంతి 110 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయట పడింది.
ఆ సంగతి అలా ఉంటే... ధోనీ ఈ రికార్డ్ సిక్స్ బాదిన తర్వాత బంతికే ఔంటయ్యారు. దీంతో ఒక్కసారిగా ఆర్సీబీ అభిమానుల్లో ప్లే ఆఫ్ ఆశలు చిగురించాయి. ఒక్కసారిగా వారి ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ ఈ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్థావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
వాస్తవానికి ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో చెన్నై ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాలంటే చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు చేయాలి. అప్పటికే ఎంఎస్ ధోనీ (25: 13 బంతుల్లో) రవీంద్ర జడేజా (42*: 22 బంతుల్లో) క్రీజ్ లో ఉన్నారు. అలాంటి సమయంలో యశ్ దయాల్ చేతికి కెప్టెన్ డుప్లెసిస్ బంతినిచ్చాడు. ఈ సమయంలో... తొలి బంతికే ధోనీ 110 మీటర్ల సిక్స్ కొట్టాడు.
దీంతో... ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కసారిగా చల్లబడిపోయారు! కానీ, రెండో బంతిని స్లో డెలివరీగా వేసిన యశ్.. కీలకమైన ధోనీ వికెట్ ను పడగొట్టాడు. అక్కడ నుంచి బెంగళూరు విజయం వైపు కొనసాగింది. ఆ ఓవర్ లో కేవలం 7 పరుగులే ఇచ్చిన యశ్.. ఆర్సీబీని ప్లేఆఫ్స్ కు చేర్చాడు. ఈ సమయంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న డూప్లెసిస్... దానిని యశ్ కు అంకితం చేస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. ఇవీ వైరల్ గా మారాయి!