వింత కారణాల్లో ఇదోటి.. పురుగులు పడి.. ఆగిన టి20 క్రికెట్ మ్యాచ్

కానీ, వీటి కంటే మించిన కారణంతో మ్యాచ్ నిలిచిపోవడం తెలుసా..? అది కూడా టీమ్ ఇండియా ఆడుతున్న మ్యాచ్ అని తెలుసా?

Update: 2024-11-14 13:30 GMT

వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది.. అనే మాటలు సహజంగా వింటుంటాం.. వెలుతురు సరిగా లేక మ్యాచ్ ను ముందే ముగించారనే వార్తలు చదువుతుంటాం.. పిచ్ సరిగా లేక మ్యాచ్ రద్దయిందనే అరుదైన సందర్భాల గురించి తెలుసుకున్నాం.. కానీ, వీటి కంటే మించిన కారణంతో మ్యాచ్ నిలిచిపోవడం తెలుసా..? అది కూడా టీమ్ ఇండియా ఆడుతున్న మ్యాచ్ అని తెలుసా?

ఇన్నింగ్స్ బ్రేక్ కాదు.. ఇన్నింగ్స్ మొదలయ్యాక

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ జట్టుతో నాలుగు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్ లలో భారత్, దక్షిణాఫ్రికా చెరో దాంట్లో నెగ్గాయి. మూడో మ్యాచ్ బుధవారం జరిగింది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగి 219 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అజేయ సెంచరీ (107)తో రికార్డు నెలకొల్పాడు. మరోవైపు 220 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలో దిగింది దక్షిణాఫ్రికా. కానీ, ఒక్క ఓవర్ పడిందో లేదో మ్యాచ్ ఆగిపోయింది.

డే నైట్ లో ఇబ్బందే..

టి20 మ్యాచ్ లు ఎక్కువగా డే నైట్ లో.. అంటే సాయంత్రం మొదలవుతాయి. అయితే దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతున్నందున మన ప్రేక్షకుల కోసం తగిన సమయంలో నిర్వహిస్తున్నారు. దీంతో బుధవారం రాత్రి 8.30కు మ్యాచ్ మొదలైంది. భారత ఇన్నింగ్స్ ముగిసేసరికి 11 గంటలైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ మొదలై తొలి ఓవర్ అవగానే మ్యాచ్ ఆగిపోయింది. దీనికి కారణం.. పురుగులు. కనీసం 20 నిమిషాల అనంతరం మ్యాచ్ ను తిరిగి నిర్వహించారు.

హలాల్ ఫుడ్ లేదని..

2017లో దక్షిణాఫ్రికాలోనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తేనె టీగల దాడి కారణంగా, అదే ఏడాది హలాల్ చేసిన ఫుడ్ లేనందున బంగ్లాదేశ్ తో మ్యాచ్ లు కాసేపు నిలిచిపోయాయి. 1996లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బంతులు సరఫరా చేయకపోవడంతో న్యూజిలాండ్ తో టెస్టు 20 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది.

Tags:    

Similar News