హార్దిక్... పడిలేచిన కెరటం బావోధ్వేగం వైరల్!
అయితే... తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు.
ఈ ఏడాది ఆరంభం నుంచి ఎన్నో ఇబ్బందులో, ఎంతో ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్నాడు హార్దిక్ పాండ్యా. ప్రధానంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి అతని స్థానంలో హార్దిక్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి హార్ధిక్ ని రోహిత్ ఫ్యాన్స్, పలువురు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ వెంటాడారు.. వేధించారు! సొంత జట్టులోని ఆటగాళ్లే హార్దిక్ కు వ్యతిరేకంగా ఎర్ర జెండా ఎగరేసిన పరిస్థితి!
అయితే... తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. ఇక తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ పెర్ఫార్మెన్స్ అద్భుతః అనే చెప్పాలి. దీంతో... అనూహ్య విజయం అనంతరం హార్దిక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.. కంటతడి పెట్టుకున్నాడు.. ఈ తాజాగా ప్రపంచకప్ విజయంలో అతని పాత్ర అమోఘం. అందుకే అంటున్నారు.. హార్దిక్ గ్రేట్ కమ్ బ్యాక్ అని నెటిజన్లు!
అవును... టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్ తోనూ, ఇటు బంతి తోనూ... ఆల్ రౌండర్ గా ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే.. చివరి బంతిని వేసిన అనంతరం భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అత్యంత రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా హిట్టర్స్ క్లాసెన్, డెవిడ్ మిల్లర్ లను ఔట్ చేశాడు.
ఈ సందర్భంగా స్పందించిన పాండ్యా... తన సంతోషాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదని అన్నారు. కష్టానికి ఫలితం దక్కిందని.. దేశం మొత్తం కోరుకున్నటువంటి గొప్ప విజయాన్ని సాధించామని తెలిపారు. ఈ సందర్భంగా... గత ఆరు నెలలూ ఎలా గడిచాయో తెలిసిందే అని.. తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. అనుకోని విషయాలు జరిగిపోయాయని చెబుతూ ఐపీఎల్ సీజన్ నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నాడు పాండ్యా.
నాడు ఎవరో తెలియని వారు సైతం తనకు చాలా విషయాలు చెప్పేవారని తెలిపిన పాండ్యా.. వాటితో తనకు ఎలాంటి సమస్యా లేదు కానీ.. తాజా ప్రదర్శనతో వారంతా సంతోషంగా ఉంటారనుకుంటా అని అన్నారు. ఈ క్రమంలోనే... జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయని.. వాటిని అందిపుచ్చుకోవడమే కీలకం అని ఈ సందర్భంగా వెల్లడించాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.
కాగా తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో గతంలో జరిగిన అవమానాలను పక్కనపెట్టి పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగిన పాండ్యా... అటూ బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ రాణించాడు. నిలకడగా బౌలింగ్ చేసి 8 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. ఇదే సమయంలో... 151 స్ట్రైక్ రేట్ తో 144 పరుగులు చేశాడు. అయితే... తీసిన వికెట్లు, చేసిన పరుగులు చాలా క్లిష్ట సమయాల్లోవి కావడం గమనార్హం.