ఐర్లాండ్ టూర్.. ఆసియాకప్.. ప్రపంచ కప్.. ఎన్నెన్ని టీమిండియాలో?

దీన్ని చూసే "యువ ప్రతిభావంతులతో టీమిండియా కిక్కిరిసిపోతోంది. వీరితో ఒకటి, రెండు కాదు మూడో జట్టును దించొచ్చు" అని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా వ్యాఖ్యానించాడు.

Update: 2023-08-03 17:30 GMT

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. గురువారం నుంచి తొలి టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. త్వరలో ఐర్లాండ్ పర్యటన కు వెళ్లనుంది.. దీనికి కెప్టెన్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఆపై సెప్టెంబరు లో ఆసియా గేమ్స: లో ఆడనుంది. ఆ జట్టుకు సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆసియా కప్ ఆడబోతున్న జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్. ఒకటే భారత దేశానికి ఇన్ని జట్లా..? అంటే ఔననే చెప్పాలి.

మహా బలంగా బెంచ్..

క్రికెట్ అంటే టీమ్ గేమ్. జట్టులోని 11 మంది తలో చేయి వేస్తేనే ఫలితం. కానీ.. టీమిండియాకు ఒకప్పుడు ప్రతిభావంతుల కొరత ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకరికి మించి ఒకరు అన్నట్లుంది బెంచ్. మీకు గుర్తుందో లేదో.. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై ఏడాది అవుతోంది. ఓపెనర్-వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ లో మంచిగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమై ఆర్నెల్లు దాటింది. కానీ, ఆ ప్రభావం ఎక్కడా లేదు. అంతెందుకు..? మొన్నటి వెస్టిండీస్ వన్డే సిరీస్ లో ప్రధాన పేసర్లు షమీ, సిరాజ్ లేకుండా మన జట్టు గెలిచింది.

ఇన్ని జట్లు ఎలాగంటే..?

అంతా ఐపీఎల్ మహిమ. అందుకే ఇన్ని "టీమిండియాలు" తయారయ్యాయి. ఫ్రాంచైజీ క్రికెట్ లో ఆయా జట్ల తరఫున ఆడిన క్రికెటర్ల ప్రతిభ వెలుగు లోకి వచ్చింది. ఒకప్పటిలా రంజీలు, ముస్తాక్ అలీలు, దేవధర్ ట్రోఫీలు ఏళ్ల తరబడి ఆడుతూ జాతీయ జట్టులోకి రావాల్సిన పనిలేదు. కేవలం రెండు సీజన్లు ఐపీఎల్ లో దుమ్మురేపితే చాలు అంతర్జాతీయ క్రికెటర్ గా మారొచ్చు. కాగా, ఇప్పుడు కనీసం మూడు టీమిండియాల ను ఎంపిక చేసేంత బెంచ్ బలం మన దేశం లో ఉంది. దీనికి నిదర్శనమే వేర్వేరు టోర్నీల కు వేర్వేరు జట్లు. దీన్ని చూసే "యువ ప్రతిభావంతులతో టీమిండియా కిక్కిరిసిపోతోంది. వీరితో ఒకటి, రెండు కాదు మూడో జట్టును దించొచ్చు" అని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా వ్యాఖ్యానించాడు.

ఇవిగో ఆ వేర్వేరు జట్లు..

ఆసియా క్రీడల కు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్, శివం మావి, శివమ్ దూబె, ప్రభ్ సిమ్రన్ సింగ్. (యశ్ ఠాకూర్, సాయి కిశోర్, సాయి సుదర్శన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా రిజర్వు ప్లేయర్లు)

ఐర్లాండ్ టూర్ కు టీమిండియా: బుమ్రా (కెప్టెన్), రుతురాజ్, జైశ్వాల్, తిలక్, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబె, సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ క్రిష్ణ, అర్షదీప్, ముఖేశ్ కుమార్, అవేశ్ ఖాన్.

వెస్టిండీస్ తో టి20 జట్టు: శుభ్‌ మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ , ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ (కెప్టెన్‌), సూర్యకుమార్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్, చాహల్‌ /రవి బిష్ణోయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ / అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌కుమార్‌.

Tags:    

Similar News